ట్రైలర్ టాక్: అనుపమ 'క్రేజీ కళ్యాణం'.. పైసా వసూల్ కామెడీ!
పెళ్లి అంటేనే సందడి.. ప్రేమ, గొడవలు, ఫన్నీ సీన్స్ ఉంటే ఆ హడావుడే వేరు. ఇప్పుడు ఇలాంటి పెళ్లి సందడితోనే ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతోంది 'క్రేజీ కళ్యాణం'.
పెళ్లి అంటేనే సందడి.. ప్రేమ, గొడవలు, ఫన్నీ సీన్స్ ఉంటే ఆ హడావుడే వేరు. ఇప్పుడు ఇలాంటి పెళ్లి సందడితోనే ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతోంది 'క్రేజీ కళ్యాణం'. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా పెళ్లి చుట్టూ జరిగే గందరగోళం, కుటుంబంలో వచ్చే సరదా గొడవలతో నిండిపోయినట్లు కనిపిస్తోంది.
దసరా సమయంలో ఫ్యామిలీతో కలిసి చూసే ఎంటర్టైనింగ్ మూవీగా సినిమాను తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ట్రైలర్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ మ్యారేజ్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. ఒకవైపు పెళ్లి సంబంధాలు, మరోవైపు ప్రేమ వ్యవహారాలు.. ఇంకోవైపు కుటుంబ సభ్యుల మధ్య జరిగే సరదా గొడవలు నవ్వులు పూయించేలా ఉన్నాయి. తరుణ్ భాస్కర్ రోల్ ఆ గందరగోళానికి మరింత ఎంటర్ట్టైన్మెంట్ యాడ్ చేసేలా కనిపిస్తోంది.
బాలరాజు అనే రోల్ లో ఆయన నటిస్తున్నారు. నరేష్ కు అల్లుడిగా కనిపించే ఆ రోల్ ప్రవర్తన కుటుంబంలో ఎలాంటి పరిస్థితులకు కారణమవుతుందనేది ట్రైలర్ లో చూపించారు. ఉదయం మంచివాడిలా కనిపిస్తూ.. రాత్రి తాగి వచ్చి హడావుడి చేసే బాలరాజు రోల్ చుట్టూ కొన్ని ఫన్నీ సీన్స్ ఉన్నాయి. తరుణ్ భాస్కర్ తనదైన యాక్టింగ్ తో ఆ రోల్ ను ఇంట్రెస్టింగ్ గా మార్చినట్లు కనిపిస్తోంది.
మరోవైపు నరేష్ రోల్ కూడా కథలో మెయిన్ గా కనిపిస్తోంది. తన కూతురు కీర్తికి పెళ్లి చేయాలని నరేష్ ట్రే చేస్తుంటారు. కానీ ఆమెకు మాత్రం తనకంటూ కొన్ని ఆశయాలు ఉంటాయి. ముందుగా తన కెరీర్ పై దృష్టి పెట్టాలని అనుకుంటుంది. ఇదే సమయంలో అఖిల్ రాజ్ తో లవ్ లో ఉన్నట్లు తండ్రికి చెబుతుంది. దీంతో కథలో అసలు గందరగోళం మొదలవుతుంది.
అనుపమ రోల్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. నార్మల్ లవ్ స్టోరీలకు భిన్నంగా.. తన జీవితంపై తనకు క్లారిటీ ఉన్న అమ్మాయిగా ఆమె కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ యాసలో అనుపమ డైలాగ్స్ కొత్తగా అనిపిస్తున్నాయి. ప్రేమ, పెళ్లి విషయంలో అమ్మాయిల అభిప్రాయాలకు కూడా వాల్యూ ఇవ్వాలనే అంశాన్ని ఎంటర్టైన్మెంట్ తో కలిపి చూపించినట్లు కనిపిస్తోంది. సినిమాలో కేవలం నవ్వులే కాకుండా కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలకు కూడా చోటున్నట్లు ట్రైలర్ చెబుతోంది.
బూసం జగన్ మోహన్ రెడ్డి ఆరో సినిమాస్ బ్యానర్ పై ఆ చిత్రాన్ని నిర్మించారు. బద్రప్ప గాజుల దర్శకత్వం వహించగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. తొలుత అక్టోబర్ 30న విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఆ మూవీ ట్రైలర్ లో కనిపించిన ఎంటర్టైన్మెంట్ సిల్వర్ స్క్రీన్ పై కూడా కంటిన్యూ అయితే.. దసరా సమయంలో ప్రేక్షకులకు మంచి నవ్వుల విందు అందించే అవకాశం ఉంది.