అప్పుడు కన్నీళ్లు ఆగలేదు.. జీవితంలో మర్చిపోలేను: రజినీకాంత్

శనివారం ఈవెంట్ జరగ్గా.. రజినీకాంత్ వేదికపై మాట్లాడారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.;

Update: 2025-08-03 06:21 GMT

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి అందరికీ తెలిసిందే. ఎంతో కష్టపడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు టాప్ స్టేజ్ కు చేరుకున్నారు. దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ఆయన.. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో కూలీ మూవీతో థియేటర్స్ లోకి రానున్నారు.

రజినీకాంత్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాను లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఆ మూవీలో శ్రుతి హాసన్, అమీర్ ఖాన్, నాగార్జున, సాబిన్ సాహిర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

శనివారం ఈవెంట్ జరగ్గా.. రజినీకాంత్ వేదికపై మాట్లాడారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఒకానొక సమయంలో తాను కూలీగా లగేజ్‌ మోయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత ఆ వ్యక్తి అనిన మాటలకు ఎంతో బాధపడ్డానని చెప్పారు. ఆ సమయంలో తనకు కన్నీళ్లు అసలు ఆగలేదని రజినీకాంత్ వెల్లడించారు.

ఓరోజు తాను రోడ్డుపై నిలబడి ఉండగా, ఒక వ్యక్తి నన్ను పిలిచారని అప్పుడు లగేజ్‌ ను టెంపో వరకు కూడా తీసుకెళ్తావా అని అడిగినట్లు రజినీ తెలిపారు. అప్పుడు తాను ఓకే చెప్పానని, సదరు వ్యక్తి తనకు పరిచయమున్న వ్యక్తిలా అనిపించారని తెలిపారు. కొంతసేపటి తర్వాత ఇద్దరం ఒకే కాలేజ్‌ లో చదువుకున్నామని అర్థమైనట్లు పేర్కొన్నారు.

ఆ తర్వాత లగేజ్ మొత్తాన్ని టెంపో దగ్గరికి తీసుకెళ్లాక చేతిలో రూ.2 పెట్టాడని, అంతే కాకుండా ఒక మాట కూడా అన్నాడని తెలిపారు. అప్పట్లో తనకున్న అహంకారం ఎవరికీ లేదని, ఆ రోజులు గుర్తున్నాయా అని అడిగినట్లు చెప్పారు. దీంతో కన్నీళ్లు ఆగలేదని, జీవితంలో ఎంతో బాధపడిన సందర్భమదేనని రజినీకాంత్ వేదికపై గుర్తుచేసుకున్నారు.

అదే సమయంలో లోకేష్ కనగరాజ్ కోసం మాట్లాడారు. ఆయనే సినిమాకు రియల్ హీరో అని, కమర్షియల్ డైరెక్టర్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. క్యాస్టింగ్ తో ఆయన ఒక తుఫాను క్రియేట్ చేశారని అన్నారు. స్టోరీలో పంచ్ డైలాగ్స్ ఉండవని ముందే చెప్పినట్లు పేర్కొన్నారు. సినిమా ఒక ఇంటెన్సిటీ డ్రామా అని స్టోరీ విన్నప్పుడే క్లారిటీ ఇచ్చినట్లు వెల్లడించారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News