నార్త్ అమెరికాలో కూలీ.. ప్రీమియర్ ప్రీ సేల్స్‌లోనే ఊచకోత!
సౌత్ ఇండియన్ సినిమాలు ఇటీవలి కాలంలో గ్లోబల్ లెవెల్లో మంచి ప్రభావం చూపిస్తున్నాయి.;
సౌత్ ఇండియన్ సినిమాలు ఇటీవలి కాలంలో గ్లోబల్ లెవెల్లో మంచి ప్రభావం చూపిస్తున్నాయి. ఇక ఈ సారి తమిళ సినీ పరిశ్రమకు చెందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అంతర్జాతీయ స్థాయిలో కొత్త రికార్డు సృష్టించింది. రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ చిత్రం నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో ప్రీమియర్ ప్రీ సేల్స్ ద్వారా అద్భుతమైన రికార్డ్ ను అందుకుంది.
ఈ సినిమా $2 మిలియన్లకు పైగా ప్రీమియర్ ప్రీ సేల్స్ సాధించి, మొదటి తమిళ చిత్రంగా ఈ ఘనతను సాధించింది. ఈ విజయాన్ని ‘సన్ పిక్చర్స్’ తమ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలే వార్ 2తో పోటీగా ఉన్న సమయంలో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేవలం తమిళ ప్రేక్షకులే కాదు, తెలుగులో డబ్ అవుతున్నందున తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రికార్డు పట్ల చర్చ మొదలైంది.
ఇక ట్రైలర్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టించడంతో, ఈ ప్రీ సేల్స్ నంబర్లు ఆ హైప్‌ను మరింత బలపరిచాయి. ‘కూలీ’ ప్రీమియర్ ప్రీ సేల్స్ నార్త్ అమెరికాలో ఎందుకు ఇంత వేగంగా పెరిగాయి అన్నది చూస్తే, రజనీకాంత్ స్టార్ పవర్ ప్రధాన కారణం. గతంలో ఆయన సినిమాలు కబాలి, జైలర్ కూడా ఓవర్సీస్‌లో బలమైన ఓపెనింగ్స్ సాధించాయి.
కానీ ఈ సారి దర్శకుడు లోకేష్ కనగరాజ్ క్రేజ్, యాక్షన్ థ్రిల్లర్ సెటప్, మల్టీ స్టారర్ కాస్టింగ్ వంటి సాలీడ్ పాయింట్స్ కలసి ఓవర్సీస్ మార్కెట్‌లో ఊహించని రెస్పాన్స్ ను తీసుకొచ్చాయి. అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ వంటి స్టార్స్ సినిమాలో ఉండటంతో హిందీ, తెలుగు, కన్నడ మార్కెట్ల నుంచి కూడా ఓవర్సీస్ డిమాండ్ పెరిగింది.
ఈ రికార్డ్ తో, ‘కూలీ’కి వచ్చే ఓపెనింగ్ డే కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బుకింగ్స్ ఈ స్థాయిలో ఉండటంతో, ఆగస్టు 14న విడుదల రోజు నార్త్ అమెరికా ప్రీమియర్స్‌లో వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, అమెరికా, కెనడా ప్రాంతాల్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లా వాతావరణం ఏర్పడుతోంది. మరోవైపు, ఇండియన్ మార్కెట్‌లో కూడా ‘కూలీ’ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.