కూలీ ముందు పెను సవాళ్లు..?

తన సినిమాటిక్ యూనివర్స్ తో క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా కూలీ మీద ఆ హైప్ ఉంటుంది.;

Update: 2025-07-28 18:30 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా ఆగష్టు 14న వస్తుంది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమాలో శృతి హాసన్ ఫిమేల్ లీడ్ గా నటించగా బుట్ట బొమ్మ పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ చేసింది. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్నాయి.

పాన్ ఇండియా రేంజ్..

కూలీ సినిమాపై టోటల్ కోలీవుడ్ ఇండస్ట్రీ ఫోకస్ చేసింది. ఎందుకంటే ఈమధ్య తమిళ పరిశ్రమ నుంచి వస్తున్న సినిమాలు ఏవి కూడా ఆశించిన స్థాయి ఫలితాలు అందుకోలేదు. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో తమిళ సినిమాలు డిజప్పాయింట్ చేస్తున్నాయి. ఈ టైం లో కూలీ సినిమా వస్తుంది. అందుకే కూలీ కోలీవుడ్ కి ఒక బూస్టింగ్ ఇస్తుందని నమ్ముతున్నారు.

తన సినిమాటిక్ యూనివర్స్ తో క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా కూలీ మీద ఆ హైప్ ఉంటుంది. ఐతే అది ఎంతవరకు రీచ్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. కూలీ సినిమాలో మన కింగ్ నాగార్జున ప్రతినాయకుడి రోల్ చేశారు. నాగార్జున కన్విన్స్ అయ్యారంటేనే సినిమాలో మ్యాటర్ ఉందని చెప్పొచ్చు. వీరే కాదు కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా సినిమాలో భాగమయ్యారు.

1000 కోట్ల మార్క్..

తమిళ పరిశ్రమ కలగా ఉన్న 1000 కోట్ల మార్క్ ని కూడా కూలీ నెరవేరుస్తుందా అనే చర్చ కూడా జరుగుతుంది. కూలీ బజ్ బాగుంది.. రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎటొచ్చి సినిమానే అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఐతే కూలీపై ఇప్పటివరకు ఏర్పడిన క్రేజ్ అంతా కూడా రాబోతున్న ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ తో పెంచాలి.

మరోపక్క కూలీకి పోటీగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ చేసిన వార్ 2 కూడా వస్తుంది. ఒకవేళ ఆ సినిమా క్లిక్ అయితే మాత్రం కూలీకి షాక్ తగిలే ఛాన్స్ ఉంది. కూలీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే వార్ 2 ఏమి చేయలేదు. కానీ టాక్ బాగా రాకపోతే మాత్రం వార్ 2 డామినేట్ చేసే ఛాన్స్ లేకపోలేదు.

ఇవన్నీ దాటుకుని కూలీ సూపర్ హిట్ కొట్టాలంటే సినిమాలో స్టఫ్ బాగా ఉండాలి. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నారని తెలుస్తుంది. మరి రజిని కూలీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుందా లేదా అన్నది మరో 3 వారాల్లో తెలుస్తుంది.

Tags:    

Similar News