కూలీకి దెబ్బేసిన సెన్సార్..?
సినిమాలకు సెన్సార్ A సర్టిఫికెట్ ఇచ్చింది అంటే అది పెద్దలకు మాత్రమే అని అర్థం. ఐతే విపరీతమైన వైలెన్స్, శృతిమించిన శృంగారం ఉంటే A సర్టిఫికెట్ ఇస్తారు;
సినిమాలకు సెన్సార్ A సర్టిఫికెట్ ఇచ్చింది అంటే అది పెద్దలకు మాత్రమే అని అర్థం. ఐతే విపరీతమైన వైలెన్స్, శృతిమించిన శృంగారం ఉంటే A సర్టిఫికెట్ ఇస్తారు. మరీ హద్దు దాటితే బ్లర్ చేయడం.. డైలాగ్స్ అయితే బీప్స్ వేయడం చేస్తారు. ఐతే ఒకప్పుడు A సర్టిఫికెట్ వచ్చింది అంటే అది అడల్ట్రెట్ సినిమా అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు భారీ యాక్షన్ సినిమాలకు కూడా A ఇచ్చేస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా సెన్సార్ సర్టిఫికెట్ ది ఏముంది అనేలా చూస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ..
U/A, A రెండిటికీ ఒక అక్షరమే తేడా అనుకుంటాం కానీ A సర్టిఫికెట్ వల్ల చాలా నష్టం వస్తుంది. 18 ప్లస్ ఆడియన్స్ మాత్రమే ఆ సినిమాలు చూస్తారు. లేటెస్ట్ గా వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాకు సెన్సార్ A సర్టిఫికెట్ ఇచ్చింది. ఐతే సినిమా చూసిన ఆడియన్స్ ఈ సినిమాకు సెన్సార్ ఎందుకు A సర్టిఫికెట్ ఇచ్చింది అన్నది అర్ధం కాలేదు. సినిమాలో కొన్ని సీన్స్ వైలెన్స్ అనిపించినా ఈ మధ్య అది చాలా కామన్ అనిపించేలా మాత్రమే ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే ఈమధ్య చాలా సినిమాలు లైక్ పుష్ప 2 లాంటి సినిమాల్లో చూపించిన వైలెన్స్ కన్నా కూలీలో తక్కువే ఉంది. విలన్స్ సైమన్ అదే మన నాగార్జున చేసే హత్యలు, దయాల్ రోల్ లో సౌబిన్ చేసే వైలెన్స్ అన్నీ కూడా లిమిట్స్ క్రాస్ చేయలేదనే అనిపిస్తుంది. కానీ సెన్సార్ మాత్రం ఈ సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చింది.
వార్ 2 కు U/ A..
ఇక కూలీతో పాటు వచ్చిన వార్ 2లో కూడా యాక్షన్ సీన్స్, వైలెన్స్ అంతకుమించి ఉన్నాయి. కియరా బికినీ సీన్ కూడా మైండ్ బ్లాక్ చేస్తుంది. అలాంటి సినిమాకు మాత్రం సెన్సార్ U/ A సర్టిఫికెట్ ఇచ్చింది. మరి కూలీలో ఉన్నదేంటి, వార్ 2 లో లేనిది ఏంటో తెలియదు కానీ కూలీ యు/ఏ రేటింగ్ వచ్చి ఉంటే మాత్రం రజనీ టీనేజ్ ఫ్యాన్స్ అంతా కూడా కూలీని చూసే ఛాన్స్ ఉండేది.
ఐతే ఈమధ్య కొన్ని థియేటర్లు A సర్టిఫికెట్ ఉన్నా కూడా అండర్ 18 ఆడియన్స్, పిల్లలను ఎలో చేస్తున్నారు. మరి వైలెన్స్ కామన్ అయ్యిందని అలా చేస్తున్నారా ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూలీ సినిమాకు సెన్సార్ A సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చిందని అంటున్నారు ఆడియన్స్. దీని కన్నా చాలా దారుణమైన వైలెన్స్, రక్తపాతం ఉన్న సినిమాలకు కూడా U/A ఇచ్చినప్పుడు ఈ సినిమాకే ఎందుకు ఇలా చేశారని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.