ప్రభాస్ 'రాజా సాబ్'.. ప్రీమియర్స్ సంగతేంటి?

అయితే ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న రాజా సాబ్.. సంక్రాంతికి కానుకగా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.;

Update: 2026-01-06 05:36 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ ది రాజా సాబ్ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. హారర్ కామెడీ ఫాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా కోసం డార్లింగ్ అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. స్క్రీన్ పై మూవీ ఎప్పుడు పడుతుందా.. చూసేద్దామా అనే ఆసక్తితో ఉన్నారు.

అయితే ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న రాజా సాబ్.. సంక్రాంతికి కానుకగా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాతో సినీ పొంగల్ సందడి మొదలు కానుండగా.. ముందు రోజు ప్రీమియర్స్ కూడా పడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

దీంతో ప్రీమియర్స్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని ప్రీమియర్ షోస్ పై అంతా ఫోకస్ చేశారు. ఎందుకంటే రీసెంట్ గా ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో ఎవరూ తమ వద్దకు రావొద్దని, ఎలాంటి అనుమతులు ఇవ్వమని తేల్చి చెప్పారు.

ప్రీమియర్ షోస్, ధరల పెంపు విషయంలో రిక్వెస్ట్ చేయొద్దని కూడా కోరారు. ఆ తర్వాత రాజా సాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. ఓ ఇంటర్వ్యూలో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తామని తెలిపారు. సర్కార్ అభిప్రాయం బట్టి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణ ప్రీమియర్స్ పై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.

రీసెంట్ గా ప్రీమియర్ షోలకు ప్రత్యేక టికెట్ ధరలు కోరుతూ సినిమాటోగ్రఫీ మంత్రికి రాజా సాబ్ మేకర్స్ లేఖ పంపారట. మల్టీప్లెక్స్ టికెట్ రూ. 1000, సింగిల్ స్క్రీన్ టిక్కెట్లు రూ. 800గా ప్రతిపాదిస్తూ, ధరల పెంపునకు కారణాలు లేఖలో క్లుప్తంగా వివరించారని సమాచారం. ఇంకా మంత్రి నుంచి రిప్లై రాలేదని టాక్ వినిపిస్తోంది.

నిజానికి తెలంగాణలో ప్రీమియర్ షోస్, టికెట్ ధరల పెంపు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ కొన్ని నెలల్లో జరిగిన పరిణామాల తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో మేకర్స్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రాజా సాబ్ సినిమా విషయంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియర్ షోస్, ధరల పెంపునకు అనుమతులు అందుకోవడం ఈజీనే. మరికొన్ని గంటల్లో ప్రభుత్వం జీవో జారీ చేయనుందని సమాచారం. కానీ తెలంగాణలో ఏం జరుగుతుందోనని అంతా ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ఏమవుతుందో.. తెలంగాణలోని ప్రీమియర్స్ పై క్లారిటీ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News