టాలీవుడ్ బొమ్మ బ్లాస్ట్ హాలీవుడ్ లో!
ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అంటే? అంతా బాలీవుడ్ గురించి మాట్లాడేవారు. కానీ నేడు సన్నివేశం అందుకు భిన్నంగా టాలీవుడ్ గురించి మాట్లాడుతున్నారు;
ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అంటే? అంతా బాలీవుడ్ గురించి మాట్లాడేవారు. కానీ నేడు సన్నివేశం అందుకు భిన్నంగా టాలీవుడ్ గురించి మాట్లాడుతున్నారు. పాన్ ఇండియాలో తెలుగు సినిమా సత్తాతోనే ఇది సాధ్యమైంది. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్`, `పుష్ప` లాంటి సినిమాలతో తెలుగు సినిమా స్థాయి ఒక్క సారిగా మారిపోయింది. బాలీవుడ్డే టాలీవుడ్ వైపు చూస్తోంది. అక్కడ హీరోలంతా తెలుగు దర్శకులతో పని చేయడానికి సిద్దంగా ఉన్నారు. దీనంతటికి మూల పురుషుడు ఎవరు? అంటూ రాజమౌళి.
హాలీవుడ్ జెండా పాతేసేలా:
ఆయనతోనే ఇదంతా సాధ్యమైంది. బాలీవుడ్ కి మనం వెళ్లడం కాదు..వాళ్లనే ఇక్కడికి రప్పిద్దాం అన్నారు. అన్నట్లే అక్కడి స్టార్లను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక జక్కన్న నెక్స్ట్ టార్గెట్ హాలీవుడ్. అక్కడ కూడా తెలుగు సినిమా జెండా పాతేయడమే ఎజెండాగా ముందుకు కదులుతున్నారు. ఎస్ ఎస్ ఎంబీ 29 ప్లానింగ్ ఆ విధంగానే కనిపిస్తుంది. ఏకంగా 120 దేశాల్లోనే మహేష్ సినిమా రిలీజ్ అవుతుందంటే? సినిమాపై అప్పుడే హాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఇంత వరకూ ఏ హాలీవుడ్ సినిమా కూడా ఇన్ని దేశాల్లో ఒకేసారి రిలీజ్ అవ్వలేదు.
ఇంగ్లీష్ సినిమా రిలీజ్ ప్లేస్ లే టార్గెట్ గా:
దీంతో ఎస్ ఎస్ ఎంబీ 29 పై హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చర్చకు దారి తీసింది. ఇండియాలో ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. 120 దేశాల నుంచి కోట్లాది మంది వీక్షించే అవకా శం ఉంది. పదివేల కోట్ల వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖంగా ఇంగ్లీష్ సినిమాలు రిలీజ్ అయ్యే అన్నిచోట్లా టార్గెట్ చేసి మరీ ఎస్ ఎస్ ఎంబీ 29 రిలీజ్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ఆయా దేశాల స్థానిక భాషలు ఆధారంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
రాజమౌళి తర్వాత వాళ్లే:
అందుకే జెమ్స్ కామెరూన్ లాంటి దిగ్గజంతో టీజర్, ట్రైలర్ ని ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి అందించే ఈ సక్సెస్ ని కొనసాగించడానికి వెనుక స్ట్రాంగ్ లైనప్ కూడా సిద్దంగా ఉంది. సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, అట్లీ లాంటి మేకర్స్ తమ సత్తా చాటారంటే తిరుగుండదు. ఇప్పటికే అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తీస్తోన్న చిత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ప్రచారం ఉండనే ఉంది. రాజమౌళి వేగాన్ని అట్లీ కొనసాగించగలడు. బన్నీ 22వ చిత్రంతో అట్లీ స్టైలిష్ మేకింగ్ హైలైట్ అవుతుంది.
వాళ్లకు స్టార్స్ తోడైతే:
అలాగే సుకుమార్ కూడా హాలీవుడ్ స్టైల్ మేకింగ్ ని ఇష్టపడే డైరెక్టర్. ఆయన థాట్ ప్రోసస్ అక్కడ వర్కౌట్ అవుతుంది. ప్రశాంత్ నీల్ మాస్ ఎలివేషన్ హాలీవుడ్ కి కొత్తగానే ఉంటుంది. బలమైన కథ, కథనాలతో సినిమా తీసే దర్శకుడు. సందీప్ రెడ్డి వంగాది ప్రత్యేక మైన శైలి. బలమైన హీరో పాత్రతోనే కథను నడప గల దిట్ట. వర్మ లాంటి వాళ్లనే తన ఫ్యాన్స్ గా మార్చకున్న మేధావి. ఆయన ఇంకా పదును పెట్ట గలిగితే మరిన్ని అద్భుతాలు సృష్టంచడానికి ఆస్కారం ఉంటుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలకు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు ఈ నయా డైరెక్టర్లతోనే మరింత రెట్టింపు అవుతుంది.