డైరెక్టర్స్ లో రాజమౌళి.. హీరోల్లో నాని..?

రాజమౌళి సినిమా అంటే రిజల్ట్ ఏంటన్నది తెలిసిందే. శాంతి నివాసం సీరియల్ నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు రాజమౌళి ఏం చేసినా అదో అద్భుతం అనేలా చేస్తూ వచ్చారు.;

Update: 2026-01-05 04:42 GMT

రాజమౌళి సినిమా అంటే రిజల్ట్ ఏంటన్నది తెలిసిందే. శాంతి నివాసం సీరియల్ నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు రాజమౌళి ఏం చేసినా అదో అద్భుతం అనేలా చేస్తూ వచ్చారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు దర్శకుడిగా ఆయన తన ప్రతి సినిమాకు ది బెస్ట్ ఇస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్ రాజమౌళి. రాజమౌళి సినిమా అంటే చాలు ఎవరైనా సరే మిగతా సినిమాలు పక్కన పెట్టి ఆ ప్రాజెక్ట్ మీద గురి పెట్టాల్సిందే.

రాజమౌళి సినిమా ఎలా ఉంటుంది అంటే ఆయన వేసే రాజ ముద్ర లా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే ఓటమి ఎరుగని దర్శక ధీరుడిగా జక్కన్న తన ఫాం కొనసాగిస్తున్నారు. ఐతే డైరెక్టర్స్ లో రాజమౌళి ఎలానో హీరోల్లో న్యాచురల్ స్టార్ నాని అలా తయారయ్యాడు. తను చేసే ప్రతి సినిమాలో అన్నీ తానై నడిపిస్తూ సినిమా సక్సెస్ కు కారణం అవుతున్నాడు.

నాని కెరీర్ మొదటి నుంచి కొత్త డైరెక్టర్స్ తో..

నాని కెరీర్ మొదలైనప్పటి నుంచి మధ్యలో కొంత డౌన్స్ వచ్చినా మళ్లీ తనను తాను ఫిట్ చేసుకుని మంచి కథల వైపు అడుగులు వేశాడు. కొత్త దర్శకుల దగ్గర మంచి కంటెంట్ ఉంటుందని గుర్తించిన నాని కెరీర్ మొదటి నుంచి కొత్త డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు. ఇక ఈమధ్య వరుస సక్సెస్ లతో తన ఫాం కొనసాగిస్తున్నాడు నాని.

నాని సినిమా అంటే చాలు స్టోరీ ఓకే అయిన దగ్గర నుంచి రిలీజ్ వరకు అంతా డైరెక్టర్ తో కలిసి నాని ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సినిమాలో ప్రతి యాస్పెక్ట్ లో ఏం జరుగుతుంది.. ఎక్కడ ట్రాక్ తప్పుతుంది అన్నది పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తుంటారు. అందుకే నాని సక్సెస్ రేటు ఆ రేంజ్ లో ఉంది.

తనకు నచ్చిన కథను సూపర్ హిట్ చేసేందుకు..

ఎలాగైతే డైరెక్టర్స్ తో రాజమౌళి తన సినిమా కోసం ఫ్యామిలీతో కలిసి డే అండ్ నైట్ కష్టపడి తనకు రావాల్సిన అవుట్ పుట్ తెచ్చుకుంటాడో అలానే నాని కూడా తనకు నచ్చిన కథను సూపర్ హిట్ చేసేందుకు అన్నీ తానై చూసుకుంటూ సినిమా సక్సెస్ కు కారణం అవుతాడు. మిగతా హీరోలకు హిట్ సినిమా అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుండగా నాని మాత్రం పర్ఫెక్ట్ స్కెచ్ తో సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు.

మొన్నటిదాకా నాని ఒక క్లాస్ హీరో మాత్రమే అనిపించగా దసరా నుంచి తన మాస్ టర్న్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు నాని. నాని నుంచి నెక్స్ట్ ది ప్యారడైజ్ రాబోతుంది. ఆ సినిమా కూడా భారీ హైప్ తో వస్తుంది. శ్రీకాంత్ ఓదెలతో మరోసారి నాని మాస్ బ్లాస్ట్ చేస్తారని న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ది ప్యారడైజ్ తర్వాత నాని సుజీత్ డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు.

Tags:    

Similar News