మహేష్ కోసం మారిన రాజమౌళి!

ఇంతటి భారీ ప్రాజెక్టును కూడా ఎక్కడా ఆలస్యం కాకుండా అంతర్జాతీయ లొకేషన్లలో శరవేగంగా చిత్రీకరించడం రాజమౌళి మారుతోన్న వర్కింగ్ స్టైల్‌కు నిదర్శనం.

Update: 2026-05-30 22:30 GMT

రాజమౌళి సినిమా అంటే? ఆ చిత్రం థియేటర్లలోకి రావడానికి కనీసం మూడేళ్లయినా పడుతుందని అభిమానులు ముందే ఫిక్స్ అయిపోతారు. ప్రతి సన్నివేశాన్ని అత్యంత అద్భుతంగా.. పర్‌ఫెక్షన్‌తో చెక్కడం జ‌క్క‌న్న శైలి. అయితే సూపర్ స్టార్ మహేష్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న అంతర్జాతీయ అడ్వెంచర్ థ్రిల్లర్ `వారణాసి` విషయంలో మాత్రం జక్కన్న తన పాత రికార్డులను.. పని తీరును పూర్తిగా మార్చేసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమా సెట్స్‌పైకి వెళ్ళిందంటే ?నటీనటులకు డేట్ల విషయంలో చాలా పరిమితులు ఉంటాయి. కానీ ఈ చిత్రం కోసం ఆయన సరికొత్త పంథాను ఎంచుకున్నారు.

మేకింగ్ క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండానే పక్కా ప్రణాళికతో షూటింగ్‌ను శరవేగంగా నడిపిస్తున్నారు. ఎన్న‌డు లేని విధంగా ఈసారి ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌కే ఎక్కువ సమయం కేటాయించడంతో? సెట్స్ మీదకు వెళ్ళాక పనులు చాలా వేగంగా సాగుతున్నాయని తెలుస్తోంది. సినిమా స్కేల్ పెద్దది కావడంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు. దీనికోసం హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ స్టంట్ మాస్టర్స్ రంగంలోకి దిగారు. వారి నేతృత్వంలో అత్యంత సంక్లిష్టమైన యాక్షన్ షెడ్యూల్‌ను ఇప్పటికే ప్లాన్ చేశారు.

ఇంతటి భారీ ప్రాజెక్టును కూడా ఎక్కడా ఆలస్యం కాకుండా అంతర్జాతీయ లొకేషన్లలో శరవేగంగా చిత్రీకరించడం రాజమౌళి మారుతోన్న వర్కింగ్ స్టైల్‌కు నిదర్శనం. ఇక షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో కూడా మహేష్ కు పూర్తి అనుకూలంగా ప్లాన్ చేయడం విశేషం. నిరంతరాయంగా షూటింగ్ చేసి నటీనటులను ఒత్తిడికి గురికాకుండా మధ్యమధ్యలో మహేష్ కు తగిన విశ్రాంతి, హాలిడేస్ కూడా ఇస్తున్నారు. ఈ సరికొత్త షెడ్యూలింగ్ విధానం వల్ల ఈ ఏడాది ఆగస్టు నాటికే సినిమాకు సంబం ధించిన ప్రధాన షూటింగ్ భాగాన్ని దాదాపు పూర్తి చేయాలని చిత్ర యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది.

చిత్రీకరణ వేగంగా పూర్తి జ‌ర‌గ‌డంతో? పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ముందే లైన్ క్లియర్ అయిపోయింది. అక్టోబర్ నెల నుంచే ఆస్కార్ కీరవాణి ఈ చిత్రానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను ప్రారంభించ‌నున్నారు. షూటింగ్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ ప‌నులు కూడా వెంట వెట‌నే పూర్త‌య్యేలా చూస్తున్నారు. వాటికోస‌మే ప్ర‌త్యేకంగా స‌మ‌యాన్ని కేటాయించి వృద్ధా చేయ‌డం కంటే? ఉన్న స‌మ‌యాన్నే తెలివిగా వినియోగించుకుంటున్నారు. ఆ న‌మ్మ‌కంతోనే చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామ‌ని ధీమ‌గా ప్ర‌క‌టించ‌గ‌లిగారు. రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు తన శైలిని మార్చుకుని.. వేగంతో పాటు నాణ్యతతో సినిమాను పూర్తి చేయడం సినిమా మేకింగ్ విధా నంలో ఓ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తున్న‌ట్లే.

Tags:    

Similar News