ప్రభాస్ 'రాజా సాబ్'.. గోల్డెన్ ఛాన్స్ ఎలా యూజ్ చేసుకుంటుందో?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాజా సాబ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది.;

Update: 2026-01-08 10:45 GMT

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాజా సాబ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు (జనవరి 9) గ్రాండ్‌ గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైన ఆ సినిమాకు ఈ రోజు (జనవరి 8) రాత్రి నుంచే ప్రత్యేక ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇలాంటి సమయంలో విజయ్ నటించిన జన నాయగన్ అనూహ్య కారణాలతో వాయిదా పడటం రాజాసాబ్‌ కు మంచి అవకాశంగా మారింది.

నిజానికి తమిళనాడు, ఓవర్సీస్ మార్కెట్లలో జన నాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్ రాజాసాబ్‌ ను మించి కనిపించాయి. అయితే అనూహ్య పరిణామాల వల్ల జన నాయగన్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం జనవరి 9న విడుదల కాదని స్పష్టత వచ్చింది. కొత్త విడుదల తేదీని ఈ రోజే ప్రకటించే అవకాశం ఉంది. దీంతో రాజా సాబ్‌ కు పోటీ లేకుండా పెద్ద ఎత్తున థియేటర్లు దక్కాయి.

తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ఖాయం?

రాజా సాబ్‌ మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అవుతోంది. ప్రభాస్ మార్కెట్, పండుగ వాతావరణం, పోటీ లేకపోవడం సినిమాకు ప్లస్ గా మారాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ రోజు పడే ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ టాక్ వస్తే, బుకింగ్స్ ఒక్కసారిగా జంప్ అవ్వడం ఖాయం. బుకింగ్స్ ట్రెండ్స్ లో ఫుల్ చేంజ్ వస్తుంది.

నార్త్, ఓవర్సీస్‌ లో కూడా ఆధిపత్యం

జన నాయగన్ వాయిదాతో నార్త్ ఇండియా, అమెరికా సహా ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్లలో రాజాసాబ్‌ కు క్లియర్ డామినేషన్ దక్కింది. వీకెండ్ లో మెయిన్ గా రాజాసాబ్‌ దే హవా ఉండేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభాస్‌ కు నార్త్ ఇండియాలో ఇప్పటికే మంచి క్రేజ్ ఉండటంతో.. హారర్ ఫాంటసీ జానర్ కొత్తదనం కలిసి ఓపెనింగ్స్‌ ను మరింత పెంచే అవకాశం ఉంది.

గోల్డెన్ ఛాన్స్‌ ను ఎలా వాడుకుంటుంది?

మొత్తంగా చూస్తే రాజా సాబ్ కు ఒక గోల్డెన్ ఛాన్స్ దక్కింది. పెద్ద సినిమాల పోటీ లేకపోవడం, ప్రభాస్ స్టార్ పవర్, పాన్‌ ఇండియా రిలీజ్ అన్నీ కలిసి సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేయనున్నాయి. అయితే గోల్డెన్ ఛాన్స్ ను పూర్తిగా వాడుకోవాలంటే ఒక్కటే కీలకం అదే మౌత్ టాక్. ప్రీమియర్ షోల నుంచే స్టోరీ, హారర్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, రాజా సాబ్ కలెక్షన్లు అంచనాలను మించే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రభాస్ సినిమా ఎంతవరకు గోల్డెన్ ఛాన్స్ ను యూజ్ చేసుకుంటుందన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News