రాజ్ తరుణ్ సైలెంట్ గేమ్.. ఈసారి ఏమవుతుందో?
లేటెస్ట్ గా ఈ సైలెన్స్ ను బ్రేక్ చేస్తూ 'పాంచ్ మినార్' సినిమాతో నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.;
ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్, గత కొంత కాలంగా కేవలం వ్యక్తిగత వివాదాలతోనే వార్తల్లో నిలిచాడు. లవణ్య, మాల్వి మల్హోత్రా అంటూ సాగిన ఆ డ్రామా, పోలీస్ కేసులు అతని కెరీర్ ను కాస్త డిస్టర్బ్ చేశాయన్నది వాస్తవం. అయితే ఇప్పుడు ఆ గొడవలన్నింటినీ పక్కనపెట్టేసి, రాజ్ తరుణ్ పూర్తిగా గేర్ మార్చాడు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ను, మీడియాలో వచ్చే వార్తలను పట్టించుకోకుండా తన పని తాను సైలెంట్ గా చేసుకుపోతున్నాడు.
లేటెస్ట్ గా ఈ సైలెన్స్ ను బ్రేక్ చేస్తూ 'పాంచ్ మినార్' సినిమాతో నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈసారి బాక్సాఫీస్ బరిలో గట్టి పోటీనే ఉంది. అల్లరి నరేష్ '12 ఏ రైల్వే కాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే', కిరణ్ అబ్బవరం సపోర్ట్ తో వస్తున్న 'రాజు వెడ్స్ రాంబాయి'.. ఇలా అరడజను సినిమాలు రేసులో ఉన్నాయి. వీరంతా ఒకరితో ఒకరు పోటీపడుతూ ప్రమోషన్స్ లో దుమ్మురేపుతున్నారు.
మిగతా సినిమాలతో పోలిస్తే 'పాంచ్ మినార్' ప్రమోషనల్ సౌండ్ కాస్త తక్కువగానే వినిపిస్తోంది. 'ప్రేమంటే' కోసం నాగచైతన్య, 'రైల్వే కాలనీ' కోసం హరీష్ శంకర్ లాంటి స్టార్స్ గెస్టులుగా వచ్చి హైప్ క్రియేట్ చేశారు. కానీ రాజ్ తరుణ్ టీమ్ మాత్రం కేవలం కంటెంట్ మీదే భారం వేసింది. రామ్ కడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ప్రీమియర్స్ వేసి, 'మౌత్ టాక్' ద్వారా ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించాలని ప్లాన్ చేస్తున్నారు.
రాజ్ తరుణ్ కెరీర్ గ్రాఫ్ చూస్తే, ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ చాలా అవసరం. 'కుమారి 21 ఎఫ్' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్ళీ తలుపు తట్టలేదు. రీసెంట్ గా ఆహాలో వచ్చిన 'చిరంజీవ' ఓటీటీ మూవీకి వ్యూస్ వచ్చినా, సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరగలేదు. వరుస పరాజయాలతో మార్కెట్ కాస్త డల్ అయిన టైమ్ లో, ఈ సినిమా ఫలితం ఆయన ఫ్యూచర్ కు చాలా కీలకం కానుంది.
అయితే ఫలితాలతో సంబంధం లేకుండా రాజ్ తరుణ్ వరుస ప్రాజెక్టులు సైన్ చేస్తున్నాడు. రీసెంట్ గా 'టార్టాయిస్' అనే కొత్త సినిమాను లాంచ్ చేయడంతో పాటు, ఒక తమిళ్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు. పర్సనల్ లైఫ్ లో జరిగిన డ్యామేజ్ నుంచి రికవర్ అయి, మళ్ళీ కెరీర్ బిల్డ్ చేసుకోవాలనే కసి అతనిలో కనిపిస్తోంది. మొత్తానికి నవంబర్ 21న రాజ్ తరుణ్ కి ఒక అగ్నిపరీక్ష అనే చెప్పాలి. పబ్లిసిటీ ఆర్భాటాలు లేకపోయినా, సినిమాలో విషయం ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారని అతను నమ్ముతున్నాడు. మరి ఈసారి లక్ కలిసి వస్తుందా అనేది చూడాలి.