ఫ్యామిలీమ్యాన్ 3.. సమంత - నిమ్రత్ షాడో రోల్స్?
రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన `ఫ్యామిలీమ్యాన్-3` ఈ సీజన్ లో మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్‌గా బరిలోకి వస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.;
రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన `ఫ్యామిలీమ్యాన్-3` ఈ సీజన్ లో మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్‌గా బరిలోకి వస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నవంబర్ 21 నుంచి ఇది ఓటీటీలో స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. ఈసారి సీజన్ 3 మొదటి రెండు భాగాల కంటే అద్భుతంగా ఉందని ప్రశంసలు కావాలని ఎదురు చూస్తున్నట్టు రాజ్ అండ్ డీకే తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈసారి ఈశాన్య రాష్ట్రాల రాజకీయాలు, విస్పోటనం, క్రూరత్వం గురించి తెరనిండుగా చూపించబోతున్నారు. జైదీప్ అహ్లావత్ విలన్ పాత్రలో దడ పుట్టిస్తాడు. అతడు కథానాయకుడు శ్రీకాంత్ తివారీని నీడలా వెంటాడతాడని ఇప్పటికే రాజ్ అండ్ డీకే వెల్లడించారు. శ్రీకాంత్ కుటుంబం నుంచి వచ్చే సమస్యలను ఎదుర్కొంటూనే, తీవ్రమైన మనుషుల వేట సాగిస్తాడు. అతడు తన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తుంటాడు.
అలాగే ఈ వెబ్ సిరీస్ లో నిమ్రత్ కౌర్ కూడా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది. అయితే సమంత పాత్ర ఎలా ఉండబోతోంది? అనేదానికి ఇంకా పూర్తి క్లారిటీ లేదు. కానీ ఆ ఇద్దరి నటనా అందరినీ అలరిస్తుంతి. సామ్, నిమ్రత్ ఎలాంటి పాత్రలో నటించారు? అనేదాని కంటే ఆ ఇద్దరూ ఎంచుకున్న పాత్రలకు ఎలాంటి న్యాయం చేసారు? అనేది ముఖ్యమని రాజ్ అండ్ డీకే అన్నారు. పాత్రలను రూపొందించేప్పుడు ఆడ- మగ అనే తేడా చూడము అని కూడా వెల్లడించారు. ఆ ఇద్దరూ తెరపై సర్ ప్రైజ్ చేస్తారని వెల్లడించారు. నిజానికి ఆ ఇద్దరి పాత్రలను వారిని దృష్టిలో ఉంచుకుని రాయలేదని కూడా తెలిపారు.
ఫ్యామిలీమ్యాన్ 3లో మునుపటి భాగాల నుంచి ఫ్లేవర్ మిస్ కాకుండా ఆశ్చర్యపరచడం చాలా ముఖ్యమని డీకే తాజా ఇంటర్వ్యూలో అన్నారు. మొదటి రెండు సీజన్ల కంటే మూడో సీజన్ ఇంకా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరూ మూడవ సీజన్ చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇది చాలా కాలంగా వెయిటింగులోనే ఉంది. ఆ నిరీక్షణకు తగిన ఫలితం ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలు బాగా ఇష్టపడితే అది నంబర్ వన్ దశగా భావిస్తామని అన్నారు. సీజన్ 1, సీజన్ 2 కంటే ప్రజలు ఇది బావుందని అనాలి. ఈసారి సీజన్ లో శ్రీకాంత్ తివారీ (భాజ్ పాయ్) ని నీడలా వెంటాడే రుక్మా పాత్ర ఆకట్టుకుంటుంది. జైదీప్ అహ్లావత్ దీనిలో నటించారు.