95 కేజీల బరువున్న ఎన్టీఆర్‌ని చూసి షాక్
ఫిజికల్ గా రూపం ఎలా ఉన్నా, జూనియర్ ఎన్టీఆర్ తన అసాధారణ ప్రతిభ, ఎనర్జీతో బలమైన ముద్ర వేయగలిగాడని దేవ్ అన్నారు.;
ఎన్టీఆర్ తో కలిసి బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్ చాలా తెలుగు చిత్రాల్లో నటించారు. ఇటీవల తన కెరీర్ ప్రారంభంలో తారక్ తో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. సింహాద్రి, నరసింహుడు, దమ్ము చిత్రాలలో విలన్ గా నటించిన రాహుల్ దేవ్ ఆ సమయంలో 95 కేజీలు పైగా బరువున్న జూనియర్ ఎన్టీఆర్ ను మొదటిసారి చూసినప్పుడు తాను ఆశ్చర్యపోయానని తెలిపాడు. ఫస్ట్ ఇంప్రెషన్ చూసి షాక్ అయ్యాను. జూనియర్ ఎన్టీఆర్ ఇంత బరువు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయానని రాహుల్ దేవ్ అన్నారు. యువ నటుడు సాంప్రదాయ హీరో ఇమేజ్ కు సరిపోడని దేవ్ అనుకున్నాడట. అయితే అతడి ఆకారం ఎలా ఉన్నా, తెరపై నటన, నృత్యం చేయడం, భావోద్వేగాలను వ్యక్తపరచడం, ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంలో జూనియర్ ఎన్టీఆర్ నేచురల్ ట్యాలెంట్ గొప్పగా ఆకట్టుకుంటాయని అంగీకరించారు. ఫిజికల్ గా రూపం ఎలా ఉన్నా, జూనియర్ ఎన్టీఆర్ తన అసాధారణ ప్రతిభ, ఎనర్జీతో బలమైన ముద్ర వేయగలిగాడని దేవ్ అన్నారు.
ఎన్టీఆర్ కొన్నేళ్లుగా తనను తాను మలుచుకున్నాడు. శారీరకంగా తిరిగి తనను తాను ఆవిష్కరించుకున్నాడని అన్నారు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ యాబ్స్ ని ప్రదర్శించే వీడియోను చూసిన రాహుల్ దేవ్, ఇప్పుడు పూర్తిగా రూపాంతరం చెందాడు. ఎప్పుడూ లేనంతగా సన్నగా, ఫిట్‌గా కనిపిస్తున్నాడని చెప్పాడు. ఎన్టీఆర్ పరిణామం కష్టపడి పనిచేయడమే కాకుండా అతడికి కళపై అంకితభావం గొప్పది అని రాహుల్ దేవ్ తెలిపాడు.
తాను కెరీర్ ప్రారంభించిన కొత్తలో తెలుగు సినిమాలు డ్రమటిగ్గా ఉండేవి.... కానీ సినిమాటిక్ శైలి ఎలా ఉన్నా ఎన్టీఆర్ లాంటి నటులు ప్రత్యేకంగా ప్రతిభావంతులు.. వారు నిలదొక్కుకోగలిగారని అన్నారు. సరస్వతి దేవి ఆశీర్వాదంతో కొందరు తమను భర్తీ చేయలేని దశకు చేరుకుంటారని గమనించినట్టు దేవ్ తెలిపాడు.
అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న `వెల్‌కమ్ టు ది జంగిల్`లో రాహుల్ దేవ్ నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, సంజయ్ దత్, అనిల్ కపూర్, పరేష్ రావల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటాని, లారా దత్తా, శ్రేయాస్ తల్పాడే , తుషార్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు. తదుపరి దేవర 2లో నటించే వీలుంది. ఎన్టీఆర్ ఇటీవలి రూపం నిజంగా షాకిస్తోంది. అతడు వార్ 2 కోసం బాగా సన్నబడ్డాడు. ఇప్పుడు ఇంకా పూర్తిగా బక్క చిక్కి కనిపిస్తున్నాడు.