బస్టాండ్ లో నిద్ర.. రోజుకు రెండున్నర సంపాదన!
ఆల్-టైమ్ క్లాసిక్ చిత్రం `లగాన్` లో భూరా పాత్రలో అద్భుత నటనతో మెప్పించిన సీనియర్ నటుడు రఘుబీర్ యాదవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఆల్-టైమ్ క్లాసిక్ చిత్రం `లగాన్` లో భూరా పాత్రలో అద్భుత నటనతో మెప్పించిన సీనియర్ నటుడు రఘుబీర్ యాదవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే రిలీజ్ `పంచాయత్` వెబ్ సిరీస్ తోనూ మర్ఓ సారి సంచలనంగా మారారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అయితే ఈ మహోన్నత విజయం వెనుక ఎన్నో దశాబ్దాల కఠోర శ్రమ, కన్నీళ్లు దాగి ఉన్నాయి. ఇటీవల ఆయన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన జీవిత పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. చిన్న వయసులోనే నటన మరియు సంగీతంపై ఉన్న ఇష్టంతో రఘుబీర్ యాదవ్ ఇల్లు వదిలి బయటకు వచ్చేశారు.
చేతిలో రూపాయి లేకపోవడంతో ప్రారంభంలో ఆయనకు కనీసం ఉండటానికి ఇల్లు కూడా దొరకలేదు. ఆ రోజుల్లో తలదాచుకోవడానికి సరైన చోటు లేక ఎన్నో రాత్రులు బస్సు స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలోనే నిద్రపోయానని ఆవేదనతో గుర్తుచేసుకున్నారు. వాతావరణ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా? ఆకలిని భరిస్తూనే తన కలల కోసం నిరంతరం పోరాటం సాగించనన్నారు. అటుపై పార్సీ థియేటర్ గ్రూపులో చేరిన రఘుబీర్ యాదవ్‌కు రోజుకు రెండున్నర రూపాయల వేతనం లభిం చేది. ఆ కాలంలో కూడా అంత తక్కువ మొత్తంతో నగరంలో జీవించడం ఎంతో నరకప్రాయంగా ఉండే దన్నారు.
రోజుకు ఒక్క పూట తిండి దొరికితేనే గొప్ప అనుకునే పరిస్థితుల నుండి ఆకలితో కడుపు మాడుచుకుంటూ గడిపిన రోజుల వరకు ప్రతి ఒక్క క్షణాన్ని అధిగమించారు. కడుపు ఖాళీగా ఉన్నా? స్టేజ్ ఎక్కినప్పుడు మాత్ర నటనలో ఎలాంటి లోటు రాణిచ్చే వాడిని కాదన్నారు. రంగాస్థలమే తనకు నటనలోని ఓనమాలు నేర్పిన అసలైన పాఠశాల అని రఘుబీర్ యాదవ్ బలంగా నమ్ముతారు. అక్కడ ఎదుర్కొన్న కష్టాలే మనుషులను, వారి వైవిధ్యమైన నైజాలను లోతుగా అర్థం చేసుకోవడానికి తనకు ఎంతో సహాయపడ్డాయన్నారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా? కళ పట్ల ఉన్న అపారమైన అంకితభావమే తనను ముందుకు నడిపించిందని..ఆ రోజుల్లో సంపాదించిన అనుభవాలే నేడు తనను ఇంతటి సహజ నటుడిగా తీర్చిదిద్దాయని గర్వంగా చెప్పుకొచ్చారు. దశాబ్దాల నిరంతర పోరాటం తర్వాతే ఆయనకు చలనచిత్ర పరిశ్రమలో తగిన గుర్తింపు లభించింది.పాతికేళ్లు పూర్తి చేసుకున్న `లగాన్` చిత్రంలో ఆయన పోషించిన పాత్ర నటుడిగా దేశవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాలలో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన నేడు `పంచాయత్` సిరీస్ ద్వారా సరికొత్త తరం ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరయ్యారు. ఒక నిరుపేద కళాకారుడి స్థాయి నుండి భారతీయ సినిమా రంగంలో అనివార్యమైన నటుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.