అనసూయ వ్యాఖ్యలపై రాశి ఫైర్.. 'పేరు' ఎత్తకుండా స్ట్రాంగ్ కౌంటర్

హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై టాలీవుడ్ యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే.;

Update: 2026-01-05 06:25 GMT

హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై టాలీవుడ్ యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. అయితే ఆ కాంట్రవర్సీలోకి సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ వచ్చి చేరారు. దీంతో కొందరు వారిద్దరికీ సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు కొన్ని ఎగ్జాంపుల్స్ తో తీవ్రంగా మండిపడుతున్నారు.

ముఖ్యంగా అనసూయ ఓ కామెడీ షోలో చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. అందులో భాగంగా ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. షోలో భాగంగా హైపర్ ఆది చేసిన స్కిట్ లో 'నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా' అని అనసూయ అంటే.. ఆది 'అవి రాశి గారి ఫలాలు కాదు రాశిఫలాలు' అని అంటాడు. దీంతో అది అసభ్యకరమైన పదమని నెటిజన్లు ఇప్పటికే కామెంట్లు పెట్టారు.

అయితే ఇప్పుడు సీనియర్ నటి రాశి, ఆ వీడియోపై రెస్పాండ్ అయ్యారు. శివాజీ చేసిన కామెంట్స్ పై కూడా మాట్లాడారు. మైక్ దొరికితే ఏదో ఒకటి మాట్లాడాలని కాదని, తన గురించి మాట్లాడాలని అనుకుంటున్నానని తెలిపారు. శివాజీ మాట్లాడింది 100 % తప్పు అని అనని చెప్పారు. హీరోయిన్స్ గురించి కాదు కానీ, అనుకోకుండా రెండు పదాలు అనుకోకుండా దొర్లాయని అన్నారు. దానికి సారీ కూడా చెప్పారని అన్నారు.

అదే సమయంలో తన గురించి అనుకోకుండా ఇందులోకి లాగారని చెప్పుకొచ్చారు. "ఓ ఛానెల్ లో వచ్చే షో నుంచి నాకు ఆ మధ్య కాల్ వచ్చింది. ప్రేయసి రావే మూవీ స్కిట్ చేద్దామనుకుంటున్నాను మేడమ్.. మీరు చేయాలని అన్నారు.కానీ కొన్ని ఎపిక్స్ ను టచ్ చేయకూడదు. ప్రతి ఆర్టిస్ట్ కు ఒక మూవీ ఉంటుందని చెప్పా. చిన్నపిల్లలందరూ నన్ను గుర్తు పడుతున్నారు అంటే ప్రేయసి రావే వల్లే అని చెప్పా" అని తెలిపారు.

జడ్జిగా రమ్మంటే వస్తానేమో కానీ స్కిట్ మాత్రం చేయలేనని చెప్పాను. కానీ వారు ఆ స్కిట్ చేశారు. రాశిఫలాలు అనే పదానికి ఆ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అని అడిగింది. ఒక మహిళ.. అలా ఎలా అసలు అడుగుతుంది? కానీ ఆ యాంకరే ఇప్పుడు బాగా మాట్లాడుతుంది. రాశి ఫలాల్లో నేను లేను. నా పేరు విజయలక్ష్మి. అందులో నేను లేను. కానీ రాశి గారులో నేను ఉన్నాను" అని తెలిపారు.

"ఆ మాట అన్నాక జడ్జి కూడా హహ్హహ అని నవ్వింది. నేను ఆ ప్లేస్ లో ఉంటే ఏంటి డైలాగ్ అని అడిగేదాన్ని. కామిక్ చేయవచ్చు కానీ బాడీ షేమింగ్ చేయడానికి కన్న తల్లిదండ్రులకు కూడా హక్కు లేదు. నేను ఆ విషయాన్ని లీగల్ చేద్దామనుకున్న.. కానీ మా అమ్మ ఎందుకు ఇది అని అనేసరికి ఆగిపోయాను" అంటూ రాశి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags:    

Similar News