ఈగో కూడా మంచిదే.. కానీ

డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కు స్పెష‌ల్ ఫ్యాన్స్ ఉంటారు. ఏ విష‌యం పై అయినా త‌న అభిప్రాయాన్ని సూటిగా చెప్తూ ఉంటాడు పూరీ.;

Update: 2025-05-05 16:57 GMT
ఈగో కూడా మంచిదే.. కానీ

డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కు స్పెష‌ల్ ఫ్యాన్స్ ఉంటారు. ఏ విష‌యం పై అయినా త‌న అభిప్రాయాన్ని సూటిగా చెప్తూ ఉంటాడు పూరీ. క‌రోనా టైమ్ నుంచి పూరీ మ్యూజింగ్స్ పేరుతో యూట్యూబ్ లో ప‌లు అంశాలపై మాట్లాడుతూ ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంటున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్‌. త‌న సినిమాల‌తో ఎలాగైతే ప్రేక్ష‌కుల్ని మెప్పించాడో దీంతో కూడా అలానే యూత్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాడు పూరీ.

పూరీ మ్యూజింగ్స్ కి కూడా ఓ స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయ‌న ఏ టాపిక్ మీద మాట్లాడినా ఎంతోమంది ఫాలోవ‌ర్లు దాన్ని విన‌డానికి ఆస‌క్తిగా ఉంటారు. రీసెంట్ గా పూరీ ఈగో అనే విష‌యంపై మాట్లాడాడు. ఈగో మంచిదేన‌ని, అది మ‌న సెల్ఫ్ రెస్పెక్ట్ ను కాపాడుతుంద‌ని, కాక‌పోతే ఈగో విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పూరీ జ‌గ‌న్నాథ్ అంటున్నాడు.

అంద‌రం నా బ్రెయిన్ లో ఉన్న‌ది నేనే క‌దా అనుకుంటార‌ని, కానీ కాద‌ని, మ‌న లోప‌ల ఇంకొక‌డుంటాడ‌ని వాడి పేరే ఈగో అని, ఇది మొత్తం ర‌న్ చేసేది వాడేన‌ని, ఓవ‌ర్ థింకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు వాడే సీఈఓ అని, ఎవ‌రైనా నీ మీద జోక్ వేస్తే వాడు అన‌వ‌స‌రంగా హ‌ర్ట్ అవుతాడని, ఎక్క‌డ లేని కోపమొస్తుంద‌ని, కోపంలో వాడోదో డెసిష‌న్ తీసుకుంటాడ‌ని పూరీ చెప్పాడు.

ప్ర‌తిక్ష‌ణం అవ‌త‌ల వారితో ఎలా డిస్క‌ష‌న్ కు దిగాలి? అందులో మ‌న‌మే గెల‌వాలంటే ఏం మాట్లాడాల‌నే విష‌యంపై ప్ర‌తీక్ష‌ణం ట్రైనింగ్ ఇస్తుంటాడని, ప్ర‌తీ దానికి లోపలి వాడికి కోపం వ‌స్తుంటుంద‌ని, వాడెవ‌డు మ‌న కారుని ఓవ‌ర్‌టేక్ చేశాడు? మ‌న‌కి ముందు చెప్పాలి క‌దా, మ‌న‌కు ముందు పెట్ట‌కుండా వేరే వాళ్ల‌కు ముందు వ‌డ్డిస్తున్నారేంటి ఇలా ప్ర‌తీ విష‌యానికి లోప‌లి వాడు రియాక్ట్ అవుతూ ఉంటాడ‌ని పూరీ చెప్పుకొచ్చాడు.

ఈగో వ‌ల్ల ఎన్నో గొడ‌వ‌ల‌వుతాయని, అలా అని మ‌న ఈగోని తీసేయ‌లేమ‌ని, వాడు మ‌న తోడ‌బుట్టిన త‌మ్ముడు లాంటి వాడ‌ని, మ‌న‌తోనే ఉంటాడ‌ని, కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ ఈగో బ్ర‌ద‌ర్ మంచివాడేన‌ని, మ‌న ఆత్మాభిమానాన్ని కాపాడుతూ, మ‌నం ఎవ‌రి ముందు త‌ల‌వంచ‌కూడ‌ద‌ని, త‌గ్గ‌కూడ‌ద‌ని కోరుకుంటూ ఉంటాడ‌ని, కాక‌పోతే వాడి వ‌ల్ల మ‌నల్ని ఎంతో ఇష్ట‌ప‌డే వాళ్లు కూడా బాధ ప‌డ‌తార‌ని, ఫ్యామిలీలోని వాళ్లు, త‌ల్లిదండ్రుల్ని కూడా ఈ ఈగో దూరం చేస్తుంద‌ని అందుకే ఈగోని దాచ‌మ‌ని చెప్తున్నాడు పూరీ. ఈగోని దాచ‌డం ఒక ఆర్ట్ అని, దాన్ని దాయ‌గ‌లిగితే స‌గం గొడ‌వ‌లు త‌గ్గుతాయ‌ని, ఎదుటివారితో మాట్లాడేట‌ప్పుడు మీ ఇగోతో కాకుండా మీరే మాట్లాడండ‌ని, వాడిని మాట్లాడ‌నివ్వ‌కండని పూరీ జ‌గ‌న్నాథ్ తెలిపాడు.

Full View
Tags:    

Similar News