స్త్రీ ఆధిప‌త్యంతో నడిచే స‌మాజం: పూరి జ‌గ‌న్నాథ్

తేనెటీగ‌ల వ‌ల్ల పాలినేష‌న్ జ‌రుగుతుంది. అదే జ‌ర‌గ‌క‌పోతే మ‌నం తిన‌డానికి కూర‌గాయ‌లు ఉండ‌వు. అందువ‌ల్ల తేనెప‌ట్టు ఎక్క‌డ క‌ట్టినా దానిని డిస్ట్ర‌బ్ చేయ‌కండి.;

Update: 2025-05-22 04:16 GMT

'పూరి మ్యూజింగ్స్' ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌తో ప్ర‌జాద‌ర‌ణ‌ పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి కొత్త ఎపిసోడ్ లో తేనెటీగ‌ల గురించి తెలుసుకుంటే చాలా ఆస‌క్తికర సంగ‌తులు తెలిసాయి.. తేనెటీగ‌ల స‌మాజం స్త్రీ ఆధిప‌త్యంతో న‌డుస్తుంద‌ని ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ చెప్పారు. తేనెటీగ‌ల‌ ఫ్యామిలీలో అన్ని ప‌నుల్ని ఆడ తేనెటీగ‌లే చేస్తాయని కూడా పూరీ అన్నారు.

రాణి తేనెటీగ గుడ్లు పెడుతుంది. గూడు క‌ట్ట‌డం, తేనె క‌లెక్ట్ చేయ‌డం, లార్వా సంర‌క్ష‌ణ ఇవ‌న్నీ ఆడ తేనెటీగ‌లే చేస్తాయి. మ‌గ తేనెటీగ‌లు రాణి గారితో శృంగారం త‌ప్ప వేరే ఏ ప‌నీ చేయ‌వు. డ్రోన్స్ లా ఎగురుతాయి. గూడు చుట్టూ ప‌నీ పాటా లేకుండా తిరిగేవి మ‌గ తేనెటీగ‌లు. అయితే తేనెటీగ‌లు 24కిలోమీట‌ర్ల స్పీడ్ తో రోజుకు 10 కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తాయి. ఒక్కో తేనెటీగ 5000 పువ్వుల్ని వెతుకుతాయి. ఒక పువ్వు చుట్టూ తిరిగితే అందులో తేనె ఉందో లేదో క‌నిపెట్టేస్తాయి. ఇవి ఆల్ట్రా వ‌యెలెట్ రేస్ ని చూడ‌గ‌ల‌వు.

కొన్ని తేనెటీగ‌లు ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ‌తాయి. కొన్నిచోట్ల అపార సంప‌ద‌ను క‌నిపెడ‌తాయి. ఆ విష‌యాన్ని వేరే తేనెటీగ‌ల‌కు చెప్పాలి. వాటికి మాట‌లు రావు గ‌నుక మిగ‌తా వాటికి అవి డ్యాన్స్ చేసి చూపిస్తాయి. ఆ డ్యాన్స్ పేరు వావిల్ డ్యాన్స్. ఇవి డ్యాన్స్ చేసి డ‌యాగ్ర‌మ్ రెడీ చేస్తాయి. దీనిని బ‌ట్టి ఇత‌ర తేనెటీగ‌లు డ్రోన్స్ లాగా బ‌య‌ల్దేర‌తాయి. అవ‌న్నీ పువ్వుల్ని సులువుగా క‌నుగొంటాయి. అవ‌న్నీ డ్రోన్స్ లా బ‌య‌ల్దేర‌తాయి. తేనెప‌ట్టు గ‌దుల్ని ప్ర‌త్యేక విధానంలో డిజైన్ చేస్తాయి. దానివ‌ల్ల ఎక్కువ తేనెను నిల్వ చేయ‌గ‌ల‌వు. అలాగే సీతాకాలంలో బాగా చ‌లిగా ఉంటే, అవ‌న్నీ గ‌ట్టిగా రెక్క‌లు విదిల్చి హీట్ జ‌న‌రేట్ చేస్తాయి. ఆ త‌ర్వాత‌ అవ‌న్నీ గూడులోకి దూరి వెచ్చ‌గా నిదురిస్తాయి.

తేనెటీగ‌ల వ‌ల్ల పాలినేష‌న్ జ‌రుగుతుంది. అదే జ‌ర‌గ‌క‌పోతే మ‌నం తిన‌డానికి కూర‌గాయ‌లు ఉండ‌వు. అందువ‌ల్ల తేనెప‌ట్టు ఎక్క‌డ క‌ట్టినా దానిని డిస్ట్ర‌బ్ చేయ‌కండి. మీ ఇంట్లో తేనె పట్టు క‌ట్టినా భ‌య‌ప‌డొద్దు. మీ ఇల్లు ఎంతో న‌చ్చితే కానీ అవి అలా చేయ‌వు. అందువ‌ల్ల మీ ఇంట్లో తేనె ప‌ట్టు క‌ట్టేందుకు ఎలాంటి మందులు స్ప్రే చేయ‌కుండా ఉంచండి. వాటి జాతిని అంతం చేయొద్దు. మ‌నం అన్నీ త‌యారు చేసినా తేనెను చేయ‌లేం. తేనె చాలా విలువైన‌ది. స‌రిగ్గా దాస్తే ఎన్నేళ్ల‌యినా నిల్వ ఉండేది తేనె. ఎన్నో వేల సంవ‌త్స‌రాల క్రితం ఈజిప్టులో దొరికిన తేనెను ఈ జ‌న‌రేష‌న్ లో తిన్నారు... అని పాడ్ కాస్ట్ లో చెప్పారు.

Full View
Full View
Tags:    

Similar News