అతనితోనే జనగణమన..?

పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబోలో బెగ్గర్ టైటిల్ తో ఒక సినిమా వస్తుంది. టైటిల్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ దాదాపు అదే పెట్టే ఆలోచనలో ఉన్నాడట పూరీ.;

Update: 2025-08-06 04:16 GMT

పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబోలో బెగ్గర్ టైటిల్ తో ఒక సినిమా వస్తుంది. టైటిల్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ దాదాపు అదే పెట్టే ఆలోచనలో ఉన్నాడట పూరీ. మక్కల్ సెల్వన్ తో పూరీ సినిమా. అసలు ఈ కాంబో ఎక్స్ పెక్ట్ చేయలేదు. కానీ సినిమాల్లో ఏదైనా సాధ్యమన్నట్టు ఒక్కోసారి మనం ఊహించని కాంబినేషన్స్ కూడా మనల్ని సర్ ప్రైజ్ చేస్తాయి. అలానే విజయ్ సేతుపతి పూరీ కాంబినేషన్ లో మూవీ వస్తుంది. విజయ్ సేతుపతి ఒక సినిమా చేస్తున్నాడు అంటే అందులో ఏదో ఒక స్పెషల్ ఉంటేనే చేస్తాడు.

అంత ఈజీగా సినిమాకు ఒప్పుకునే హీరో అయితే కాదు. ఇక ఆమధ్య కెరీర్ లో నెగిటివ్ రోల్స్ సైతం చేస్తూ వచ్చిన విజయ్ సేతుపతి ఇక మీదట అలాంటివి చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. అందుకే లీడ్ రోల్స్ సబ్జెక్ట్ లకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడు. పూరీ బెగ్గర్ సినిమా డాషింగ్ డైరెక్టర్ కి మంచి కంబ్యాక్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

పూరీ జన గణ మన టైటిల్ తో..

ఐతే బెగ్గర్ అనేది క్లిక్ అయితే మాత్రం పూరీ మళ్లీ విజయ్ సేతుపతితోనే సినిమా చేసే ఛాన్స్ ఉంది. పూరీ జన గణ మన టైటిల్ తో ఒక సినిమా అనుకున్నాడు. ఆ సినిమాను ఎప్పటి నుంచో తెరకెక్కించాలని చూస్తున్నాడు పూరీ. మహేష్ తో చేయాలనుకున్న ఆ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇక లైగర్ తర్వాత విజయ్ తోనే జన గణ మన సినిమా అనౌన్స్ చేశాడు పూరీ జగన్నాథ్.

లైగర్ ఫ్లాప్ అవ్వడం వల్ల ఆ సినిమా ముందుకు సాగలేదు. ఇప్పుడు విజయ్ సేతుపతితో జన గణ మన ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది. పూరీ విజయ్ సేతుపతి కాంబినేషన్ మూవీ బాగా వస్తుందట. ఈమధ్య సార్ మేడం ప్రమోషన్స్ లో విజయ్ సేతుపతి స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. సో పూరీ విజయ్ సేతుపతితో హిట్ కొడితే జన గణ మన విజయ్ సేతుపతికి తగినట్టుగా మార్చి రాసే అవకాశం ఉంటుంది.

పూరీ కంబ్యాక్ ఫ్యాన్స్ కి పూనకాలు..

తప్పకుండా పూరీ కంబ్యాక్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే ఛాన్స్ ఉంటుంది. విజయ్ సేతుపతి కూడా పూరీ డైరెక్షన్ లో చేయడం క్రేజీగా ఫీల్ అవుతున్నాడు. ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఈ డైరెక్టర్ మళ్లీ తిరిగి ఫాం లోకి వస్తే చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మరి అది విజయ్ సేతుపతి సినిమాతో అయినా జరుగుతుందా లేదా అన్నది చూడాలి.

డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీకి ఎవరు ఛాన్స్ ఇస్తారా అన్న డిస్కషన్ జరిగింది. విజయ్ సేతుపతినే లైన్ లో పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు పూరీ. బెగ్గర్ సక్సెస్ అయితే మాత్రం పూరీ తిరిగి ఫాం లోకి వచ్చినట్టే. ఇక ఆయన కంబ్యాక్ ఇస్తే పూరీని ఆపడం ఎవరి వల్లా కాదు.

Tags:    

Similar News