పిక్‌టాక్ : ఇందుకే ఈమె గ్లోబల్ బ్యూటీ
తాజాగా ప్రముఖ మ్యాగజైన్ కవర్ పై ప్రియాంక చోప్రా కనిపించింది. ఆమె ఈ ఫోటోల్లో చాలా స్టైలిష్‌గా, అందంగా కనిపిస్తుంది.;
బాలీవుడ్ సినిమాలతో దేశం మొత్తం పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. హిందీ సినిమాలతో పాటు ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్‌లను చేసింది. హాలీవుడ్‌లో ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించింది. ఇంగ్లీష్ సినిమాల్లోనే కాకుండా సిరీస్‌లు, టీవీ షో ల్లో ఈమె నటించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు హాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ స్టార్‌గా నిలిచింది. అక్కడ స్టార్‌డం దక్కిన నేపథ్యంలో బాలీవుడ్ సినిమాలకు దూరం అయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రియాంక చోప్రా ఎట్టకేలకు మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.
ఒకవైపు ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్‌లను చేస్తున్న ఈ అమ్మడు మరో వైపు ఇండియన్ సినిమాల్లో నటించేందుకు ఓకే చెబుతోంది. మహేష్ బాబుతో కలిసి ఇప్పటికే ఒక సినిమాను చేస్తున్న ప్రియాంక చోప్రా మరో వైపు బాలీవుడ్ సినిమాలోనూ నటించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రియాంక చోప్రాకి సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో ముందు వరుసలో ఉంది. గ్లోబల్ బ్యూటీగా పేరు దక్కించుకుందంటే ఈ అమ్మడి అందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈమె ఫ్యాషన్ ఐకాన్‌గా ఎప్పటికప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటుంది.
తాజాగా ప్రముఖ మ్యాగజైన్ కవర్ పై ప్రియాంక చోప్రా కనిపించింది. ఆమె ఈ ఫోటోల్లో చాలా స్టైలిష్‌గా, అందంగా కనిపిస్తుంది. ఈ స్థాయి అందంగా ఉండటం వల్లే ప్రియాంక చోప్రాకి గ్లోబల్ బ్యూటీ అనే పేరు దక్కిందని చాలా మంది ఈ ఫోటోలకు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా సింపుల్ అండ్ స్వీట్ మేకోవర్‌లో చూపు తిప్పుకోనివ్వడం లేదు. పైగా ఈమె తన వన్ సైడ్ బ్లేజర్‌ను తొలగించడం ద్వారా అందాల విందు చేసింది. ఇంత అందంగా ఉండటం వల్లే ఈమెకు హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అవుతారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పీసీ ముందు ముందు మరిన్ని విజయాలు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇన్నాళ్లు ఇండియన్ మూవీస్‌లో నటించక పోవడంతో తీవ్రంగా విమర్శలు చేసిన వారు ఇప్పుడు తెలుగు సినిమాలో నటించడంతో పాటు, ఒక హిందీ సినిమాను చేసేందుకు కమిట్ కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే హిందీలో మరిన్ని సినిమాలు ఆమె చేసే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్‌లను సైతం ఈమె కంటిన్యూ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. వెబ్ సిరీస్‌ల్లో ప్రియాంక చోప్రా అందాల ఆరబోత ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆ విధంగా కూడా ప్రియాంక చోప్రా ఆకట్టుకుంటుంది. అందుకే మరిన్ని గ్లోబల్ మూవీస్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.