భ‌ర్త‌ను మిస్ అవుతున్న పీసీ.. రీజ‌నేంటంటే?

గ్లోబ‌ల్ సెన్సేష‌న్ ప్రియాంక చోప్రా రీసెంట్ గా హైద‌రాబాద్ కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రియాంక న‌టిస్తున్న భారీ ప్రాజెక్టు కోసం ప్రియాంక హైద‌రాబాద్ కు వ‌చ్చారు.;

Update: 2025-11-16 08:09 GMT

గ్లోబ‌ల్ సెన్సేష‌న్ ప్రియాంక చోప్రా రీసెంట్ గా హైద‌రాబాద్ కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రియాంక న‌టిస్తున్న భారీ ప్రాజెక్టు కోసం ప్రియాంక హైద‌రాబాద్ కు వ‌చ్చారు. మ‌హేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా కోసం జ‌రిగిన గ్రాండ్ ఈవెంట్ లో పాల్గొన‌డానికి ప్రియాంక హైద‌రాబాద్ కు రాగా, ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గ్లోబ‌ల్ బ్యూటీ త‌న భ‌ర్త నిక్ జోనాస్ ను మిస్ అవుతున్న‌ట్టు తెలిపారు.

దేశీ గ‌ర్ల్ అవ‌తారంలో ప్రియాంక‌

త‌మ‌కు సంబంధించిన ఓ భారీ ఈవెంట్ జ‌రిగేట‌ప్పుడు ఎవ‌రైనా స‌రే భర్త కూడా త‌నతోనే ఉండాల‌నుకుంటారు. కానీ నిక్ ఈ ఈవెంట్ కు రాలేదు. ఈ కార‌ణంతోనే ప్రియాంక త‌న భ‌ర్త‌ను మిస్ అవుతుందేమో అనుకుంటారేమో, కాదు. ఇక్క‌డ విష‌యం వేరే ఉంది. ప్రియాంక త‌న భ‌ర్త‌ను మిస్ అవ‌డానికి గ‌ల రీజ‌న్ చాలా ముద్దుగా ఉంది. తాజాగా జ‌రిగిన వార‌ణాసి గ్రాండ్ ఈవెంట్ లో ప్రియాంక ఎంతో అందంగా, దేశీ గ‌ర్ల్ అవ‌తారంలో క‌నిపించి అంద‌రినీ ఎట్రాక్ట్ చేశారు.

ఈవెంట్ త‌ర్వాత పీసీ త‌న హెయిర్ ను సెట్ చేసుకుంటూ స‌డెన్ గా త‌న భ‌ర్త‌ను గుర్తుకు తెచ్చుకుంటూ దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ప్రియాంక త‌న హెయిర్ ను విప్పుతూ క‌నిపించారు. ప్రియాంక షేర్ చేసిన వీడియో క్లిప్ లో నా హెయిర్ ను విప్ప‌డానికి ట్రై చేస్తున్నా.. ఇవాళ ఎవ‌రు చేస్తున్నారు? హాయ్ ఖుష్బూ అని అంటూ హెయిర్ డ్రెస్స‌ర్ తో క‌లిసి పీసీ న‌వ్వుతూ క‌నిపించారు.

పీసీకి హెయిర్ డ్రెస్స‌ర్ గా మారిన నిక్

త‌న జుట్టును విప్ప‌డానికి త‌న‌కు రెగ్యుల‌ర్ గా హెల్ప్ అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని చెప్తూ ఈ సంద‌ర్భంగా త‌న భ‌ర్త‌ను మిస్ అవుతున్న‌ట్టు క్యాప్ష‌న్ ను ఇస్తూ త‌న హెయిర్ డ్రెస్స‌ర్ ఖుష్బూకు థాంక్స్ చెప్పారు ప్రియాంక‌. కాగా అక్టోబ‌ర్ లో నిక్ జోనాస్, త‌న భార్య ప్రియాంక‌కు హెయిర్ డ్రెస్స‌ర్ గా మారిన విష‌యం తెలిసిందే. వారిద్ద‌రూ ఎయిర్‌పోర్ట్ కు వెళ్తున్న‌ప్పుడు పీసీకి స్పెష‌ల్ బ‌న్ వేయ‌డానికి నిక్ హెల్ప్ చేయ‌గా, పీసీ దాన్ని షేర్ చేస్తూ నువ్వు ఈ ప‌నిలో బాగా రాణిస్తున్నావ‌ని చెప్ప‌గా, దానికి నిక్.. తాను మ‌ల్టీ టాస్కింగ్ చేస్తున్నాన‌ని, త‌న భార్య‌కు హెయిర్ స్టైలింగ్ లో హెల్ప్ చేస్తుండ‌టంతో పాటూ టీవీలో బేస్ బాల్ మ్యాచ్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నాన‌ని రెస్పాండ్ అవ‌గా, ఆ విష‌యం అప్ప‌ట్లో వైర‌ల్ అయింది. ఇప్పుడు మ‌ళ్లీ ప్రియాంక ఆ విష‌యాన్ని గుర్తు చేస్తూ త‌న భ‌ర్త‌ను మిస్ అవుతున్న‌ట్టు చెప్ప‌డంతో ఆమె షేర్ చేసిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Tags:    

Similar News