ప్రియాంక‌ చోప్రా వ‌ద్ద‌ స్థాయికి కాదు మ‌నిషికి గౌర‌వం!

ప్రియాంక చోప్రా గ్లోబ‌ల్ స్థాయిలో పేరున్న న‌టి. బాలీవుడ్ లో మొద‌లైన ఆమె ప్ర‌యాణం నేడు హాలీవుడ్ వ‌ర‌కూ వెళ్లింది.;

Update: 2025-06-26 07:30 GMT

ప్రియాంక చోప్రా గ్లోబ‌ల్ స్థాయిలో పేరున్న న‌టి. బాలీవుడ్ లో మొద‌లైన ఆమె ప్ర‌యాణం నేడు హాలీవుడ్ వ‌ర‌కూ వెళ్లింది. ఎలాంటి సినీ నేప‌థ్యం లేకుండా ఈ స్థాయికి చేరింది. సాధార‌ణ న‌టిగా కెరీర్ మొద‌లు పెట్టి అంచ‌లంచెలుగా ఎదిగింది. ప్ర‌త్యేకించి హాలీవుడ్ లో పీసీ రేంజ్ లో మరో బాలీవుడ్ న‌టి స‌క్సెస్ అవ్వ‌లేదు అన్న‌ది కాద‌న‌లేని నిజం. బాలీవుడ్ నుంచి చాలా మంది భామ‌లు హాలీవుడ్ కి వెళ్లారు.

కానీ వాళ్లెవ్వరు అందుకోని హైట్స్ ను హాలీవుడ్ లో పీసీ అందుకుంది. ఈ క్ర‌మంలో భార‌తీయుల నుంచి ఎన్నో విమ‌ర్శ‌లు, స‌వాళ్లు కూడా ఎదుర్కోంది. వృత్తిలో భాగంగా భార‌తీయ సంస్కృతిని మ‌ట్టిలో క‌లిపి స్తుంది అన్న విమ‌ర్శ కూడా ఎదుర్కుంది. కానీ ఆ విమర్శ‌లపై పీసీ ఏనాడు స్పందించ‌లేదు. అన్నింటిని మౌనంగానే భ‌రించింది. మీ ప‌ని మీరు చేసుకోండి...నా ప‌ని నేను చేసుకుంటాను అన్న త‌ర‌హాలోనే వ్య‌వ‌హ‌రించింది.

అలాంటి ప్రియాంక చోప్రా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం తెలిసింది. వ్య‌క్తిత్వంలో తానెంత గొప్ప‌ద‌న్న‌ది త‌న‌తో క‌లిసి ప‌నిచేసిన కోరియోగ్రాఫ‌ర్ విక్కీ భ‌ర‌త్యా చెప్పుకొచ్చాడు. ప్రియాంక చోప్రా గ్లోబ‌ల్ రేంజ్ న‌టి అయినా ఎంతో డౌన్ టౌ ఎర్త్. సెట్ లో ఓ సాధార‌ణ మ‌హిళ‌లాగే ఉంటుందట‌. అక్క‌డ ప‌నిచేసే అంద‌ర్నీ ఎంతో గౌర‌వంగా చూస్తుందట‌. స్థాయి తో ప‌నిలేకుండా త‌న వ‌ద్ద అంతా స‌మాన‌మే అన్న ధోర‌ణితోనే ఉంటుందట‌.

స్థాయి కంటే ఆమె వ‌ద్ద మ‌నిషికే ఎక్కువ గౌర‌వం ఉంటుంద‌ని, ఆమె ని రేర్ ఉమెన్ గా కీర్తించాడు. నిజంగా ఇలా ఉండ‌టం అన్న‌ది ఎంతో గొప్ప విష‌యం. స్థాయి, డ‌బ్బు తో నేటి స‌మాజంలో కొందరు ఎలా ప్ర‌వ‌ర్తి స్తున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు.

Tags:    

Similar News