ప్రియాంక వారియర్ లో ఈ టాలెంట్ కూడా ఉందా.. అదరగొట్టేసిందిగా?

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాల క్రితం జాతీయస్థాయిలో సంచలనంగా మారింది ఈ ముద్దుగుమ్మ.;

Update: 2025-10-24 19:30 GMT

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాల క్రితం జాతీయస్థాయిలో సంచలనంగా మారింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క కన్ను గీటుతో అబ్బాయిల మనసులను దోచుకుంది. అడపాదడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. మరొకసారి వార్తల్లో నిలిచింది అని చెప్పవచ్చు. తాజాగా తనలో దాగి ఉన్న మరో టాలెంట్ ని బయటపెట్టి అందరినీ ఆకర్షించింది.

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ప్రదీప్ రంగనాథన్ , మమిత బైజు జంటగా నటించిన చిత్రం డ్యూడ్. ఈ సినిమాల్లో భారీ హిట్ గా నిలిచిన #ఊరం బ్లడ్ అనే కవర్ పాటను చాలా క్యాజువల్ గా పాడి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా మనోహరమైన స్వరంతో పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో సింపుల్ లుక్ లో కనిపిస్తూనే తన మధురమైన గాత్రంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈమె వీడియోని తిరిగి షేర్ చేస్తూ.. "ది చార్ట్ బస్టర్ ఊరం బ్లడ్ ఫ్రమ్ డ్యూడ్ ఇన్ వాయిస్ ఆఫ్ ప్రియా వారియర్" అంటూ లవ్ ఎమోజిని కూడా షేర్ చేశారు. మొత్తానికైతే "టైం లెస్ బ్యూటీ" అంటూ అభిమానుల చేత ప్రశంసలు పొందుతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రియాలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రియా ప్రకాష్ వారియర్ విషయానికి వస్తే.. ఒరు ఆధార్ లవ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత పోలీస్ కేసు కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని ఒక పాటలోని అంశాలు ముస్లిం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఆ చిత్ర దర్శకుడిపై కూడా హైదరాబాదులో కేసు నమోదు అయింది. వివిధ రాష్ట్రాలలో కూడా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తనదైన స్టైల్ లో ఈ పాటపై వివరణ ఇచ్చినా.. ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు.

ముఖ్యంగా 1978 నాటి ఒక పాత జానపద గీతం నుంచే ఈ పాటను తీసుకున్నామని అందులో భావాలను అర్థం చేసుకోకుండా.. లోతుల్లోకి వెళ్ళకుండా.. వక్రీకరించి ఎవరో ఫిర్యాదు చేశారని ఆమె తెలిపింది. అంతేకాదు తనపై తెలంగాణలో నమోదైన కేసును కొట్టివేయాలి అని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. పైగా మహారాష్ట్రతో పాటూ తదితర రాష్ట్రాల్లో కూడా అందిన ఫిర్యాదులకు సంబంధించి తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టును కోరింది.

అలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె.. ఆ తర్వాత చెక్, ఇష్క్, బ్రో వంటి తెలుగు చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం కన్నడతో పాటు రెండు హిందీ చిత్రాలలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.


Tags:    

Similar News