రాజా సరసన మరో ట్యాలెంటెడ్ గాళ్
తాజా కథనాల ప్రకారం ప్రియా భవానీ శంకర్ మాస్ మహారాజ్ రవితేజ సరసన అవకాశం అందుకుందని సమాచారం. రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు.;
2017 నుంచి ఎనిమిదేళ్ల కెరీర్‌లో డజను పైగానే సినిమాల్లో నటించింది కోలీవుడ్ నటి ప్రియా భవానీ శంకర్. శంకర్ ఇండియన్ 2లో నటించినప్పుడు ఎక్కువగా ఈ పేరు వినిపించింది. ఆ తర్వాత `డిమోంటే కాలనీ` మూడో భాగం (డిమోంటో కాలనీ 3) అనే చిత్రంలోను ప్రియా నటిస్తోంది. శంకర్ ఇండియన్ 3 తెరకెక్కించే వీలుంటే, దానిలో కూడా నటించేందుకు ఆస్కారం ఉంది.
ఇక తమిళంలో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ పైనా దృష్టి సారించిందని సమాచారం. తాజా కథనాల ప్రకారం ప్రియా భవానీ శంకర్ మాస్ మహారాజ్ రవితేజ సరసన అవకాశం అందుకుందని సమాచారం. రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో `భర్త మహాశయులకు విజ్ఞప్తి` ఇప్పటికే చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా కాకుండా తదుపరి శివ నిర్వాణ దర్శకత్వంలోను ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటించనుంది.
నిజానికి ఈ పాత్ర కోసం సమంత రూత్ ప్రభును శివ నిర్వాణ సంప్రదించారని కథనాలు వచ్చినా, అది నిజం కాదని తాజా వార్తలు ధృవీకరిస్తున్నాయి. సమంత ప్రస్తుతం రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్నట్టు పుకార్లు ఉన్నాయి. రక్త బ్రహ్మాండ్ అనే సిరీస్ లోను నటిస్తోంది. కానీ తెలుగు సినిమాలలో అంతగా అవకాశాల్లేవ్. ఇలాంటి సమయంలో సామ్ స్థానంలో ప్రియా భావానీ శంకర్ పేరు వినిపిస్తోంది.
నిన్ను కోరి, మజిలి లాంటి ఎమోషనల్ రైడ్స్ తో బ్లాక్ బస్టర్స్ అందుకున్న శివ నిర్వాణ తన సినిమాలలో కథానాయికల పాత్రలను అద్భుతంగా ఆవిష్కరించారు. అందుకే ఇప్పుడు ప్రియా భవానీ జాక్ పాట్ కొట్టిందని అంతా భావిస్తున్నారు. మజిలీలో సమంత తరహాలో ఎమోషన్స్ పండించేందుకు ఆస్కారం ఉంటే, అది తనకు నటిగా మంచి పేరు తెస్తుందని భావిస్తున్నారు. థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైందని చెబుతున్నారు. నిర్మాతల నుండి అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చనున్నారు.