• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రిన్స్, నరేష్ 'కలి'.....

ప్రిన్స్, నరేష్ 'కలి'.. ట్రైలర్ ఎలా ఉందంటే?

| ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న కలి మూవీ.. త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతోంది. అక్టోబర్ 4వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

By - Tupaki Desk
Update: 2024-09-25 12:06 GMT

టాలీవుడ్ యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కలి. శివ శేషు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ కథా రచయిత కె. రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ సంస్థ బ్యానర్ పై ప్రొడ్యూసర్ లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న కలి మూవీ.. త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతోంది. అక్టోబర్ 4వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న వేళ మేకర్స్.. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్.. సినీ ప్రియులను ఆకట్టుకుంది. సస్పెన్స్, అదిరిపోయే ట్విస్టులతో మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. దీంతో అదే జోష్ తో నేడు ట్రైలర్ ను విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా ఆవిష్కరించగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరినీ అలరిస్తోంది.

కలి ట్రైలర్.. థ్రిల్లింగ్, గ్రిప్పింగ్ అండ్ అదిరిపోయే విజువల్స్ తో చాలా బాగుందని ప్రశాంత్ వర్మ ప్రశంసించారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో పాటు హీరోలు ప్రిన్స్, నరేష్.. సహా మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇంటి దగ్గర ప్రిన్స్.. ఓ మృతదేహాన్ని పాతిపెట్టిన సీన్ తో ట్రైలర్ ప్రారంభమైంది. అయితే ప్రిన్స్ ఇంట్లోకి వచ్చిన స్ట్రేంజర్ కు అతని గురించి అంతా తెలుసు. ఆ సమయంలో గేమ్ ఆడమని కోరుతాడు. ఆ తర్వాత ప్రిన్స్ ప్రేమ, పెళ్లి గురించి చూపించారు మేకర్స్.

అదే సమయంలో తన బాధ వెనుక కారణాలు చెబుతారు ప్రిన్స్. అతడి జీవితంలో పలు సంఘటనలు కూడా జరుగుతాయి. అయితే మూవీలో ప్రిన్స్ కు అసలు ఏమైంది? ఎందుకు కఠిన నిర్ణయం తీసుకుంటాడు? ఇంటికి వచ్చిన స్ట్రేంజర్ ఎవరు? చివరకు ఏం జరిగింది? అనేది పూర్తి సినిమా. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. చివర్లో ఓ మిస్టీరియస్ మ్యాన్ ఎంట్రీతో మూవీపై ఒక్కసారి అంచనాలు పెరిగాయి. ఇప్పుడు కలి ట్రైలర్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. సైకలాజికల్ థ్రిల్లర్ గా రానున్న మూవీలో కలి పాత్ర ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందజేస్తుందని మేకర్స్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ప్రిన్స్, నరేష్ తో పాటు నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మణి చందన, మధుమణి తదితరులు నటిస్తున్నారు. మరిన్ని అప్డేట్లను త్వరలోనే ఇవ్వనున్నారు మేకర్స్. మరి దసరాకు కొద్దిరోజుల ముందు రిలీజ్ కానున్న కలి మూవీ.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.

Full View
Tags:    
  • Kalitrailer 
  • Princececil 
  • Nareshagastya 
  • Nehakrishnan 
  • Sivasashu 
  • Leelagowthamvarma 
  • Kalimovietrailer 

Similar News

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

Copyright @2026

Powered by Blink CMS