ప్రభాస్ కాకుంటే అల్లు అర్జున్..?

ఐతే వాటిలో ఒక క్రేజీ కాంబినేషన్ సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడేలా ఉందని అంటున్నారు.;

Update: 2025-10-16 06:15 GMT

టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఈ టైం లో ఒక కథ ఒక హీరో కోసం రాస్తే అది అతనికి నచ్చినా కూడా అతని డేట్స్ అడ్జెస్ట్ అవ్వక మరో హీరో దగ్గరకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇలా ఒకటి రెండు కాదు ఈమధ్య చాలా సినిమాలు ఇలానే జరుగుతున్నాయి. ఐతే వాటిలో ఒక క్రేజీ కాంబినేషన్ సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడేలా ఉందని అంటున్నారు. ఇంతకీ ఎవరిది ఆ కాంబో అంటే.. అది రెబల్ స్టార్ ప్రభాస్ తో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా అని తెలుస్తుంది.

అవార్డ్ ఈవెంట్ లో ప్రభాస్ సినిమాపై ప్రశాంత్ వర్మ కామెంట్..

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 ఇలా సినిమాల ప్లానింగ్ ఉంది. ఐతే వీటితో పాటుగా ప్రశాంత్ వర్మతో సినిమా కూడా ఒకటి ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆమధ్య ఒక అవార్డ్ ఈవెంట్ లో ప్రభాస్ సినిమాపై ప్రశాంత్ వర్మ కామెంట్ చేశాడు. తాను రెడీగా ఉన్నా ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఓకే అని అన్నాడు. ఐతే చూస్తుంటే ప్రభాస్ ఇప్పుడప్పుడే ఫ్రీ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు.

ఎందుకంటే ప్రభాస్ వరుస సినిమాలు ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నా వాటి రిలీజ్ ల విషయంలో మాత్రం టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే సినిమాలు ఏది కూడా అనుకున్న టైం కు రావట్లేదు. రాజా సాబ్ సినిమా దాదాపు ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తుంది. అందుకే ప్రభాస్ సినిమా అంటే ఆయన డేట్స్ ఇవ్వాలి అంటే అది కుదరని పని అంటున్నారు. అందుకే ప్రభాస్ తో అంటే లేట్ అయ్యేలా ఉందని ఆ సినిమా ప్రశాంత్ వర్మ అల్లు అర్జున్ కి షిఫ్ట్ అయితే బాగుంటుందని అంటున్నారు.

ప్రభాస్ కథను అల్లు అర్జున్..

పుష్ప తర్వాత అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యాడు. ప్రస్తుతం అట్లీతో సినిమా ఒకటి చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత డైరెక్టర్స్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఐతే అల్లు అర్జున్ ఎవరితో చేస్తాడన్నది సస్పెన్స్ గానే ఉంది. ఈలోగా ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ చేయాలనుకున్న కథను అల్లు అర్జున్ తో చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. అదే జరిగితే మాత్రం ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి ఫెస్టివల్ ట్రీట్ అన్నట్టే లెక్క.

ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్ తో సూపర్ హిట్ అందుకోగా.. ఆ నెక్స్ట్ మహాకాళీ, జై హనుమాన్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాతే ప్రభాస్ సినిమా ఉండే అవకాశం ఉంది. సో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా కుదరకపోయినా అల్లు అర్జున్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. జై హనుమాన్ లో రిషబ్ శెట్టిని తీసుకున్న ప్రశాంత్ వర్మ కాంతారా చాప్టర్ 1 తర్వాత రిషబ్ విషయంలో మరింత బాధ్యత పెరిగిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News