డ్రాగన్ ఇంటర్నేషనల్ రిలీజ్!
ఇందులో ఆ మాటను బలంగా సమర్ధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. తాను రాజమౌళినే స్పూర్తిగా సినిమాలు తీస్తున్నట్లు ఓ సందర్భంలో తెలిపారు.;
సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న `వారణాసి` గ్లోబల్ స్థాయిలో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే 120 దేశాల్లో చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రాజమౌళి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఒక్క హిట్ తోనే మహేష్ ని ఇంటర్నేషనల్ స్టార్ ని చేయాలన్నది రాజమౌళి ప్లాన్. దీనిలో భాగంగానే పక్కా ప్రణాళికతో `వారణాసి`ని కనెక్ట్ చేసే ప్రయత్నంచేస్తున్నారు. రిలీజ్ అవుతున్న 120 దేశాలు లిస్ట్ బయటకు రావాల్సి ఉంది. పాన్ ఇండియా సినిమాకు `బాహుబలి`తో ఓ బాట వేసారని కొందరు భావిస్తుంటే? ఆ తర్వాత రిలీజ్ అయిన `ఆర్ ఆర్ ఆర్` తో ఏకంగా సిక్స్ లైన్ హేవేనే వేసారన్నది మరికొంత మంది అభిప్రాయం.
ఇందులో ఆ మాటను బలంగా సమర్ధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. తాను రాజమౌళినే స్పూర్తిగా సినిమాలు తీస్తున్నట్లు ఓ సందర్భంలో తెలిపారు. ఇప్పటి వరకూ నీల్ నుంచి రిలీజ్ అయిన `కేజీఎఫ్`, `సలార్` రెండు పాన్ ఇండియాకే పరిమితమయ్యాయి. ఇతర దేశల్లో రిలీజ్ అయినా? అనుకున్నంతగా రెస్పాన్న్ రాలేదు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తోన్న `డ్రాగన్` చిత్రాన్ని మాత్రం ప్రశాంత్ నీల్ కూడా అంతర్జాతీయంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. భారత్, అమెరికా, చైనా, రష్యా, జపాన్ లాంటి దేశాలతో పాటు వీలైనన్ని దేశాల్లో డ్రాగన్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
తాను రాసుకున్న కథ యూనివర్శల్ గా కనెక్ట్ అవుతుందని భావించి ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ కూడా తాను ఏ కథ రాసుకున్నా? ఆ కథకు ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ప్రేక్షకుల్ని ఆ ప్రపం చంలోకి అంతే జీగా తీసుకెళ్లగల ప్రతిభావంతుడు. `కేజీఎఫ్`, `సలార్` లు అలాంటి కాన్సెప్టులే. బ్యాక్ డ్రాప్ లు ఒకేలా అనిపించినా? కథని మాత్రం కొత్త కోణంలో నడిపించాడు. ఈ నేపథ్యంలో `డ్రాగన్` కథ ఎలా ఉంటుంది? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ అవుతంది? అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సినిమా కోసం తారక్ ప్రత్యేకంగా సన్నధమయ్యాడు. లుక్ పరంగా చాలా మార్పులు తీసుకొచ్చాడు. మునుపటి కంటే బాగా స్లిమ్ లుక్ లోకి మారిపోయాడు. దీంతో ప్రతీ ప్రేమ్ లో తారక్ ఎంతగా హైలైట్ అవుతాడు? అన్నది అభిమానుల ఊహకే వదిలేయాలి. ప్రత్యేకించి తారక్ కు జపాన్ లో భారీ ఎత్తున అభిమానులున్న సంగతి తెలిసిందే. అక్కడ మాత్రం వీలైనన్ని థియేటర్లలో `డ్రాగన్` రిలీజ్ కానుంది.