• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రశాంత్ వర్మ సెట్స్ లో...

ప్రశాంత్ వర్మ సెట్స్ లో నయా డైరెక్టర్.. గుర్తుపట్టారా?

| ప్రశాంత్ వర్మ.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-03-20 10:16 GMT

ప్రశాంత్ వర్మ.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తన ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. ఇప్పుడు హనుమాన్ తో నేషనల్ వైడ్ గా ఫేమ్ దక్కించుకున్నారు. అ! సినిమాతో డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు ప్రశాంత్ వర్మ పరిచయమైన సంగతి అందరికీ తెలిసిందే.

ఆ మూవీ తర్వాత ప్రశాంత్ వర్మ చేసిన.. కల్కి సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఆ సినిమా కాన్సెప్ట్ మంచిదే అయినా బాక్సాఫీస్ వద్ద క్లిక్ అవ్వలేదు. ఇక ఈ చిత్రం తర్వాత ఈ యంగ్ డైరెక్టర్.. జాంబిరెడ్డి మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చారు. తేజ సజ్జా నటించిన సినిమా మూవీ లవర్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు ప్రశాంత్ వర్మ.

ఇక సంక్రాంతికి హనుమాన్ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించింది హనుమాన్. సుమారు రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. 350 కోట్ల రూపాయలకు పైగా థియేటర్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతోపాటు ఓటీటీ ద్వారా మరిన్ని డబ్బులు కూడా నిర్మాతలకు తెచ్చిపెట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను కొనుగోలు చేసిన బయర్స్ మంచి ప్రాఫిట్స్ అందుకున్నారు.

ఇదంతా పక్కన పెడితే.. హనుమాన్ రిలీజ్ తర్వాత ప్రశాంత్ వర్మ ఫ్యామిలీ వెలుగులోకి వచ్చింది. ఓ వేడుకలో ఆయన భార్య సందడి చేయగా.. ప్రశాంత్ తండ్రి అయితే ఓ రేంజ్ లో వైరల్ అయ్యారు. హనుమాన్ సినిమా చూసిన అనంతరం థియేటర్ బయట ఓ మీడియాకు ఆయన మౌత్ రివ్యూ ఇచ్చారు. హనుమాన్ తీసినోడు నా కొడుకు అని గర్వంగా చెప్పుకున్నారు. దీంతో అక్కడ ఉన్నవారంతా షాకయ్యారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆయన రివ్యూ వీడియో ఫుల్ వైరల్ అయింది.

తాజాగా ప్రశాంత్ వర్మ తండ్రి.. సినిమా సెట్స్ లో సందడి చేశారు. తన కుమారుడితో కలిసి సెట్స్ కు వచ్చారు. డైరెక్టర్ సీట్ లో కూర్చుని మూవీ యూనిట్ తో మాట్లాడారు. అందుకు సంబంధించిన చిత్రాన్ని ప్రశాంత్ వర్మనే షేర్ చేశారు. సెట్స్ లో కొత్త డైరెక్టర్.. ఈ వైరల్ పర్సన్ గుర్తున్నారా? ఆయన మాటలు గుర్తున్నాయా? అని పోస్ట్ చేశారు. ఇక ప్రశాంత్ వర్మ పోస్ట్ చేయడమే లేట్.. నెటిజన్లు ఫుల్ రియాక్ట్ అవుతున్నారు.

తీసినోడు నా కొడుకు అంటూ ఆ పిక్ ను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. హనుమాన్ టైమ్ లో ఆయన మాట్లాడిన వీడియోను మళ్లీ పోస్ట్ చేస్తున్నారు. ఆయనను ఎలా మర్చిపోతామన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు. గ్రేట్ ఫాదర్ అంటూ ట్యాగ్ ఇచ్చి సందడి చేస్తున్నారు. అయితే అది ఏ సినిమా సెట్సో ఇంకా తెలియలేదు.

చాలా మంది నెటిజన్లు.. అది లేడీస్ స్పెషల్ మూవీ ఆక్టోపస్ సెట్ అని చెబుతున్నారు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడో స్టార్ట్ అయినా మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ దానిని ప్రశాంత్ వర్మ రీస్టార్ట్ చేశారని, జై హనుమాన్ కన్నా ముందే విడుదల చేయనున్నారని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

New director on set! 😎

Remember this viral guy and his famous line? 😊 pic.twitter.com/9Ml62CcITB

— Prasanth Varma (@PrasanthVarma) March 20, 2024
Tags:    
  • Prasanthvarma 
  • Dircetor 
  • Hanuman 
  • Tejasajja 
  • Dad 
  • Filmindustry 
  • Zombiereddy 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS