• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోక్షజ్ఞ మొదట్లోనే ఇంత...

మోక్షజ్ఞ మొదట్లోనే ఇంత పెద్ద ఛాలెంజా?

| ఫైనల్ గా అతనిని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతని టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి అప్పగించాడంట.

By - Tupaki Desk
Update: 2024-07-28 04:41 GMT

నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తన లుక్, బాడీ లాంగ్వేజ్ అంతా మార్చుకొని పెర్ఫెక్ట్ హీరోయిక్ మెటీరియల్ గా రెడీ అయ్యాడు. మోక్షజ్ఞ కూడా సోషల్ మీడియాలో ఈ ఏడాదిలోనే తన డెబ్యూ ఉండబోతోందని కన్ఫర్మ్ చేశాడు. ఇక బాలయ్య కూడా మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం చాలా కసరత్తు చేస్తున్నారు. ఫైనల్ గా అతనిని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతని టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి అప్పగించాడంట.

ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అందులోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని చేయాలని అనుకుంటున్నాడు. మేగ్జిమమ్ ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ బేస్ చేసుకొని సూపర్ హీరో కథలని చెప్పాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. హనుమాన్ సినిమా తర్వాత దానికి సీక్వెల్ గా జై హనుమాన్ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేసే బాధ్యతని తీసుకున్నారు.


దీంతో మోక్షజ్ఞ కోసం బలమైన కథని ప్రశాంత్ వర్మ సిద్ధం చేస్తున్నారంట. తాజాగా మోక్షజ్ఞ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన టాక్ బయటకొచ్చింది. మహాభారతంలో ఒక క్యారెక్టర్ బేస్ చేసుకొని కథని ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కోసం సిద్ధం చేస్తున్నాడంట. అంటే మోక్షజ్ఞ డెబ్యూ సినిమాతోనే పవర్ ఫుల్ క్యారెక్టర్ ని అది పౌరాణికం రిఫరెన్స్ తో చేస్తున్న కథతో రాబోతున్నాడని అర్ధమవుతోంది.

అయితే అభిమాన్యుడి క్యారెక్టర్ కి మోక్షజ్ఞ మంచి ఛాయస్ అనే మాట నందమూరి అభిమానుల నుంచి వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది ఎవరికి క్లారిటీ లేదు. అతనిని ముందు ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. మొదటి చిత్రమే అభిమాన్యుడి లాంటి బలమైన పాత్ర అంటే కచ్చితంగా చాలెంజింగ్ టాస్క్ అని చెప్పొచ్చు. పౌరాణిక సినిమాలపై ఈ రోజుల్లో అంచనాలు బాగానే ఉన్నా.. ఏమాత్రం తేడా కొట్టినా ట్రోలర్స్ కు ఛాన్స్ ఇచ్చినట్లే. అయితే ప్రశాంత్ వర్మ టాలెంట్ ను కాస్త నమ్మొచ్చు. బాలయ్య అనుభవం కూడా కాస్త తోడైతే మంచి అవుట్ పుట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

నిజంగా ఇది వాస్తవం అయితే మాత్రం మోక్షజ్ఞ మొదటి చిత్రంతోనే స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే మాట వినిపిస్తోంది. త్వరలో ప్రశాంత్ వర్మ నుంచి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే మహాభారతంలో అభిమాన్యుడి కథని ప్రశాంత్ వర్మ చెబుతాడా లేదంటే ఆ క్యారెక్టర్ బేస్ చేసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీని బిల్డ్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Hanuman 
  • Sequel 
  • JaiHanuman 
  • Prasanthvarma 
  • Balakrishna 
  • Mokshagna 
  • Mahabharata 

Similar News

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

Copyright @2026

Powered by Blink CMS