'మహాకాళి' వైల్డ్ అప్‌డేట్.. ఆ చేయి, ఆ రక్తం.. ఏంటి కథ?

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న ప్రతీ అప్‌డేట్ ఇప్పుడు నేషనల్ లెవల్‌లో వైరల్ అవుతోంది.;

Update: 2025-10-29 07:08 GMT

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న ప్రతీ అప్‌డేట్ ఇప్పుడు నేషనల్ లెవల్‌లో వైరల్ అవుతోంది. 'హనుమాన్' సృష్టించిన సునామీ అలాంటిది. ఆ సినిమాతో తన యూనివర్స్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసిన ప్రశాంత్ వర్మ, ఇప్పుడు మూడో ప్రాజెక్ట్‌గా 'మహాకాళి'ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇండియాస్ ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.




ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, పూజా అపర్ణా కొల్లూరు అనే మహిళా దర్శకురాలు డైరెక్ట్ చేస్తున్నారని, బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారని అప్‌డేట్స్ వచ్చేశాయి. బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో, అక్కడి సంస్కృతి, ఆధ్యాత్మికతను టచ్ చేస్తూ ఈ సినిమా ఉండబోతోందని కూడా చెప్పారు.

ఇప్పుడు, ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రాబోతోంది. రేపు, అంటే అక్టోబర్ 30న, ఉదయం 10:08 గంటలకు 'మహాకాళి' నుంచి ఏదో పవర్‌ఫుల్ అప్‌డేట్ రిలీజ్ చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది. ఈ అనౌన్స్‌మెంట్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ కొత్త పోస్టర్ చాలా వైల్డ్‌గా, ఇంటెన్స్‌గా ఉంది. రక్తంతో తడిసిన ఒక చేయి, దానికి నిండుగా బంగారు గాజులు, నల్లటి నేలపై ఆ చేయి ఒక ఆయుధం పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.

పోస్టర్‌పై అంతం లేని వినాశన జ్వాల మేల్కొంది.. అనే క్యాప్షన్ మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ పోస్టర్ చూస్తుంటే, సినిమాలో కాళీ మాత రౌద్ర రూపాన్ని చాలా పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారని అర్థమవుతోంది. గతంలో మేకర్స్ చెప్పినట్లు, ఈ కథలో కాళీ మాత రౌద్రాన్నే కాకుండా, కరుణను కూడా చూపిస్తామని అన్నారు.

కానీ ఈ పోస్టర్ మాత్రం పూర్తిగా 'వైల్డ్' మూడ్‌లోనే ఉంది. ఆ రక్తంతో తడిసిన చేయి, ఆ క్యాప్షన్.. సినిమాలో యాక్షన్, వయొలెన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో హింట్ ఇస్తున్నాయి. మరి, రేపు వచ్చే ఆ అప్‌డేట్ ఏంటి? ఫస్ట్ లుక్ ఉంటుందా? లేక లేక టైటిల్ రోల్ ఎవరు చేస్తున్నారో రివీల్ చేస్తారా? అనేది తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. కానీ, ఈ ఒక్క పోస్టర్‌తోనే 'మహాకాళి'పై అంచనాలు నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిపోయాయి.

Tags:    

Similar News