లేటెస్ట్ అవుట్ ఫిట్ తో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న బాలయ్య బ్యూటీ!

అందం, అభినయంతో చక్కటి చిరునవ్వుతో అభిమానుల హృదయాలను దోచుకుంటూ తెరపై తన అద్భుతమైన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది ప్రగ్యా జైస్వాల్.

Update: 2026-05-31 13:30 GMT

అందం, అభినయంతో చక్కటి చిరునవ్వుతో అభిమానుల హృదయాలను దోచుకుంటూ తెరపై తన అద్భుతమైన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది ప్రగ్యా జైస్వాల్. అవకాశం లభించాలే కానీ పాత్రలో లీనమైపోయి అందరి దృష్టిని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ నెటిజన్స్ ను అలరిస్తోంది. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా తన కెరీర్ మొదలుపెట్టిన ఈమె సింబయాసిస్ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే వివిధ రకాల అందాల పోటీలలో పాల్గొని సక్సెస్ఫుల్ మోడల్ గా ఎదిగింది.



 


మోడలింగ్ నుండి వాణిజ్య ప్రకటనల వైపు ప్రయాణం..

మోడల్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ కళా, సంస్కృతి రంగంలో ఈమె సాధించిన విజయానికి 2014 జనవరి 22న సింబయోసిస్ సాంస్కృతిక పురస్కారం లభించింది. 2008 ఫెమినా మిస్ ఇండియా పోటీలలో పాల్గొని.. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డాన్సింగ్ క్వీన్, మిస్ ఫ్రెండ్ ఆఫ్ ఎర్త్ వంటి టైటిల్స్ ను సొంతం చేసుకుంది. మోడల్గా అందాలు ఆరబోస్తూ రెడ్ కార్పెట్ పై ర్యాంప్ వాక్ తో హొయలు పోతూ వాణిజ్య సంస్థల దృష్టిని ఆకర్షించింది. ఇక అలా డవ్, డాబర్ వాటిక, మిలీనియం హైపర్ మార్కెట్ ఫర్ దుబాయ్, ఎఫ్ బీబీ, రిలయన్స్ డిజిటల్ వంటి ప్రముఖ వాణిజ్య పాపులర్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా పనిచేసింది.



 


టెలివిజన్ నుండి తెరవైపు అడుగులు..

పలు ప్రకటనల్లో పనిచేస్తున్న సమయంలోనే 2014లో తెలుగు, తమిళ్ భాష చిత్రమైన డేగలో అవకాశం లభించింది. ఆ తర్వాత టిట్టూ ఎంబీఏ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఈమె.. 2015లో తెలుగులో వచ్చిన మిర్చీ లాంటి కుర్రాడు అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది. గుంటూరోడు, నక్షత్రం, ఓం నమో వెంకటేశాయ, జయ జానకి నాయక , ఆచారి అమెరికా యాత్ర , సైరా అంటూ పలు చిత్రాలు చేసింది. కానీ స్టార్ స్టేటస్ అయితే లభించలేదు. ఎప్పుడైతే బాలకృష్ణ అఖండ సినిమాలో నటించిందో..అప్పుడు ఊహించని పాపులారిటీ లభించింది. ఇక ఈ సినిమా తర్వాత డాకు మహారాజ్ సినిమాలో కూడా నటించింది. సినిమా సక్సెస్ అయినా.. ఈమెకు మాత్రం అవకాశాలు తలుపు తట్టలేదు.



 


బ్లాక్ డ్రెస్ లో ప్రగ్యా బ్లాక్ మ్యాజిక్..

ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్న ఈమె ఇటు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకునే విధంగా రోజుకు ఒక లేటెస్ట్ ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందులో భాగంగానే తాజాగా మరో ఔట్ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. బ్లాక్ కలర్ బాడీ కాన్ డ్రెస్ ధరించి తన అందాలతో హొయలు పోయింది. నటాషా బోత్ర స్టైల్ చేసిన ఈ అవుట్ ఫిట్ లో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది. పైగా ఈ ఫోటోలకు క్యాప్షన్ గా బ్లాక్ మ్యాజిక్ అంటూ జోడించింది. మొత్తానికైతే ఈ బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.



 


Tags:    

Similar News