50కి చేరువలో కూడా ఈ స్టంట్స్ ఏంటి మేడమ్!
సాధారణంగా ప్రతి మహిళలో కూడా 30 ఏళ్లు వచ్చాయి అంటే శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.;
సాధారణంగా ప్రతి మహిళలో కూడా 30 ఏళ్లు వచ్చాయి అంటే శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే అటు ఆహారం విషయంలో ఇటు మానసికంగా ఎంతో దృఢంగా ఉండాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. ఇకపోతే మరికొంతమంది 50 ఏళ్ల వయసుకి చేరువలో కూడా ఎవరు ఊహించని స్టంట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 50 ఏళ్ల వయసుకి అత్యంత చేరువలో ఉన్న ఈమె ఒకవైపు నటిగా రాణిస్తూనే.. మరొకవైపు పవర్ లిఫ్టింగ్ లో భారతదేశానికి సిల్వర్ మెడల్స్ సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇకపోతే తాజాగా జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 లో కూడా పాల్గొని డెడ్ లిఫ్ట్ విభాగంలో గోల్డ్ మెడల్, స్క్వాట్, బెంచ్ ప్రెస్ రెండు విభాగాల్లో సిల్వర్ మెడల్ అందుకుంది. ఓవరాల్ గా సిల్వర్ మెడల్ గెలుచుకున్నట్టు ప్రగతి చెప్పుకొచ్చింది. అలా నాలుగు మెడల్స్ సాధించి భారతదేశానికి గొప్ప పేరు తీసుకువచ్చింది. ఈ విజయం తర్వాత ఇండియాకి తిరిగి రావడంతో అభిమానులు , కుటుంబ సభ్యులు ఈమెకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా ఈ పోటీలకు వెళ్లకు ముందు కొన్ని రోజులుగా జిమ్ లో ఆమె కష్టపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒక వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.
ముఖ్యంగా పవర్ లిఫ్టింగ్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ప్రగతి ఇప్పుడు జంపింగ్ చేసి తన స్టామినా ఏంటో నిరూపించింది. జిమ్ లో ఎక్సర్సైజ్ లో భాగంగా ఒక పెద్ద ఉడెన్ బాక్స్ పైకి ఎటువంటి సహాయం లేకుండా జంప్ చేసి తన ఫిట్నెస్ ఎలా ఉందో చెప్పకనే చెప్పేసింది. మొత్తానికైతే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు 50కి చేరువలో కూడా ఈ స్టంట్స్ ఏంటి మేడం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది సాహసాలు చేయడానికి వయసుతో సంబంధం లేదు అని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి అయితే ప్రగతి టాలెంట్ కి అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు.
ప్రగతి విషయానికి వస్తే ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె.. కరోనా వచ్చిన తర్వాత ఖాళీగా ఉండలేక సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ వైరల్ అయింది. పబ్లిక్ లో కూడా తీన్మార్ స్టెప్పులతో విపరీతంగా పాపులారిటీ అందుకున్న ఈమె .. ఇప్పుడు ఏకంగా పవర్ లిఫ్టింగ్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ మెడల్స్ సాధిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా ఒకవైపు నటిగా మరొకవైపు ఇలా తన క్రేజ్ పెంపొందించుకుంటోంది ప్రగతి.