రాజాసాబ్ టీమ్ యూరప్ పయనం..

నిర్మాత ఎస్కేఎన్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో డైరెక్టర్ మారుతీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. అంతేకాదు చిత్ర యూనిట్ అందరూ కలిసి యూరప్ కి పయనమవ్వుతున్నట్టు వెల్లడించారు.;

Update: 2025-10-05 11:33 GMT

ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ మూవీ గురించి ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉండగా పలు కారణాల వల్ల చాలాసార్లు వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఎట్టకేలకు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కాబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అప్పటినుండి ఈ సినిమాకి సంబంధించి మిగిలిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా ది రాజాసాబ్ మూవీ గురించి నిర్మాత ఎస్కేఎన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.. మరి ఆ పోస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిర్మాత ఎస్కేఎన్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో డైరెక్టర్ మారుతీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. అంతేకాదు చిత్ర యూనిట్ అందరూ కలిసి యూరప్ కి పయనమవ్వుతున్నట్టు వెల్లడించారు. అలాగే యూరప్ లో రెండు పాటలను చిత్రీకరిస్తున్నామని, ఈ చిత్రీకరణతో సినిమా ఎక్కువ భాగం షూటింగ్ పూర్తి అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాత ఎస్కేఎన్ ఇచ్చిన అప్డేట్ తో ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది.

రీసెంట్ గానే ది రాజాసాబ్ మూవీ నుండి ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ చూసిన చాలామంది అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా తమదైన శైలిలో రివ్యూలు ఇచ్చారు. అంతేకాదు అభిమానులు ప్రభాస్ ని ది రాజాసాబ్ మూవీ లో కొత్తగా చూడబోతున్నాం అంటూ కామెంట్స్ పెట్టారు. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుండి యాక్షన్ సినిమాలతో మన ముందుకు వచ్చిన ప్రభాస్ ని డైరెక్టర్ మారుతి ఈ సినిమాలో కామెడీ రోల్ లో కూడా చూపించబోతున్నారు. అలా చాలా సంవత్సరాల నుండి ప్రభాస్ కామెడీని మిస్ అయిన వారికి ది రాజాసాబ్ మూవీ మంచి కిక్ ఇచ్చే సినిమా అని చెప్పుకోవచ్చు.

ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ మూవీ విషయానికి వస్తే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై.. టీజీ విశ్వ ప్రసాద్,వివేక్ కూచిబొట్ల నిర్మాతలుగా.. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్లుగా రిద్దీ కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లు నటిస్తున్నారు. ఎస్. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సంజయ్ దత్,సత్య, గణేష్ లు కీ రోల్స్ పోషిస్తున్నారు.

ప్రభాస్ సినిమాల జాబితా విషయానికి వస్తే.. మరొకవైపు సీతారామం సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది విడుదల కాబోతోంది. మరొకవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సీక్వెల్ లో కూడా ప్రభాస్ నటించబోతున్నారు.. అంతేకాదు ప్రముఖ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా వరుస సినిమాల ప్రకటన అభిమానులను ఆనందానికి గురిచేస్తోంది..

Tags:    

Similar News