ప్రభాస్ లైనప్ లో 'ఆ ఐదు' సీక్వెల్స్.. మరి స్పిరిట్ సంగతేంటి?

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆ బాహుబలి సినిమాతో ఫ్రాంచైజీ ట్రెండ్ ను స్టార్ట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు అందుకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలిచేలా కనిపిస్తున్నారు.;

Update: 2025-10-25 12:30 GMT

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆ బాహుబలి సినిమాతో ఫ్రాంచైజీ ట్రెండ్ ను స్టార్ట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు అందుకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలిచేలా కనిపిస్తున్నారు. బాహుబలితో ఫ్రాంచైజీ ట్రెండ్ తెలుగులో మొదలవ్వగా.. అందులో రెండు సినిమాలు చేశారు ప్రభాస్. మూడు భాగం కూడా చేసేలా ఉన్నారు.

అయితే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ స్టార్ట్ చేసిన ఫ్రాంచైజీ ట్రెండ్ ను అనేక మంది స్టార్ హీరోలు ఫాలో అయ్యారు. ఇప్పటికీ దాన్ని ఫాలో అవుతున్నారు కూడా.. అనుకున్న సినిమాను పలు భాగాలుగా రిలీజ్ చేయడం.. పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయడం.. సూపర్ హిట్స్ అందుకోవడం కొంతకాలంగా జరుగుతోంది.

అదే సమయంలో ప్రభాస్ మాత్రం బాహుబలి నుంచి ఫ్రాంచైజీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. బాహుబలి రెండు చిత్రాల తర్వాత నార్మల్ మూవీస్ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చేసిన ప్రభాస్.. అనంతరం మళ్లీ సలార్ ఫ్రాంచైజీలో అడుగుపెట్టారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆ సినిమా.. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ గా వచ్చింది.

ఆ మూవీ సీక్వెల్ శౌర్యాంగ్ పర్వం షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలవనుంది. సలార్ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీలో నటించారు డార్లింగ్. ఆ మూవీ సీక్వెల్ కూడా ప్రభాస్ లైనప్ లో ఉంది. ఇప్పుడు ది రాజా సాబ్ లో ప్రభాస్ యాక్ట్ చేస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.

అయితే ఆ సినిమాకు కూడా సీక్వెల్ ఉన్నట్లు తెలుస్తోంది. మూవీ లాస్ట్ లో సీక్వెల్ కు లీడ్ ఇచ్చి ఫ్రాంచైజీని డైరెక్టర్ మారుతి కంటిన్యూ చేస్తారట. అదే సమయంలో ఇప్పుడు ప్రభాస్ ఫౌజీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు కూడా సీక్వెల్ ఉందని రీసెంట్ గా డైరెక్టర్ హను రాఘవపూడి ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా తెలిపారు.

దీంతో మొత్తానికి ప్రభాస్ లైనప్ లో నాలుగు సినిమాల సీక్వెల్స్ ఉన్నాయనే చెప్పాలి. సలార్, కల్కి, రాజా సాబ్, ఫౌజీ ఫ్రాంచైజీల్లో డార్లింగ్ మరోసారి కనిపించనున్నారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ సినిమా చేస్తారని కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తుండగా.. అది కూడా ఫ్రాంచైజీ ప్రాజెక్ట్ అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే డార్లింగ్ లైనప్ లో ఉన్న మరో మూవీ స్పిరిట్ సంగతేంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాస్ యాక్షన్ పోలీస్ డ్రామాగా సినిమా రూపొందనుంది. ఆ మూవీకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ లేదా ఫ్రాంచైజీ ఉన్నట్లు ఇప్పటి వరకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎక్కడా మాట్లాడలేదు. దీంతో ఎలాంటి రూమర్స్ గానీ వార్తలు గానీ రావడం లేదు. మరి స్పిరిట్ విషయంలో సందీప్ వంగా ఏం చేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News