హను రాఘవపూడితో సినిమా.. ప్రభాస్ లుక్ కెవ్వుకేక!

మరోవైపు, ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను కూడా పూర్తి చేస్తున్నారు.;

Update: 2025-06-28 10:24 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లైనప్ లో భారీ సినిమాలను ఇప్పటికే చేర్చిన డార్లింగ్.. ఓవైపు మారుతితో రాజా సాబ్ చేస్తున్నారు. కామెడీ హారర్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పడికే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరోవైపు, ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను కూడా పూర్తి చేస్తున్నారు. పీరియాడికల్ జోనర్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో సినిమా ఉండనుందని తెలుస్తోంది. దీంతో ఆ మూవీపై కూడా వేరే లెవెల్ అంచనాలు ఉన్నాయి.

ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్ వంటి పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

ఇప్పటికే సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ఇప్పుడు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఇప్పుడు సెట్స్ నుంచి స్పెషల్ పిక్ లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫారిన్ నుంచి వచ్చిన ప్రభాస్ రీసెంట్ గా సెట్స్ కు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పిక్ .. ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ప్రభాస్ ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షర్ట్ వేసుకుని ఉన్నారు. యమా క్లాసిక్ గా కనిపించారు. సెట్స్ లో ఓ కర్ర బెంచీపై ఉన్న డార్లింగ్.. క్లీన్ షేవ్, మీసాలతో కనిపించారు. దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతున్నారు.

ప్రభాస్ లుక్ అదిరిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. సైనికుడిగా డార్లింగ్ వేరే లెవెల్ లో కనిపించనున్నారని అర్థమవుతుందని అంటున్నారు. సూపర్ పిక్ అని చెబుతున్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. మూవీ కోసం వెయిట్ చేస్తున్నామని అంతా కామెంట్లు పెడుతున్నారు. మరి ప్రభాస్- హను రాఘవపూడి చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News