సందీప్, ప్రభాస్.. అది డౌటేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో భారీ రేంజ్ లో స్పిరిట్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో భారీ రేంజ్ లో స్పిరిట్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. హై యాక్టేన్ పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ తోపాటు ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు వస్తుందోనని వెయిట్ చేస్తున్నారు.
అయితే స్పిరిట్ ప్రాజెక్ట్ ప్రకటించిన నాలుగేళ్లు అవుతుంది. ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. నిజానికి సందీప్ వంగా తెరకెక్కించిన గత మూవీ యానిమల్ తర్వాత స్పిరిట్ చిత్రీకరణ మొదలు కావాల్సి ఉంది. కానీ అప్పటికే ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. వివిధ ప్రాజెక్టులకు అప్పటికే కమిట్ అయ్యి ఉన్నారు.
దీంతో స్పిరిట్ షూటింగ్ మొదలు కాలేదు. అయితే కొన్ని నెలలుగా ప్రభాస్.. అటు ది రాజా సాబ్.. ఇటు ఫౌజీ మూవీ చిత్రీకరణల్లో పాల్గొంటున్నారు. ఆ రెండింటిలో ఏదో ఒకటి కంప్లీట్ అయ్యాక.. డార్లింగ్ స్పిరిట్ మూవీ సెట్స్ కు వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ రెండు మూవీల షూటింగ్స్ పూర్తి కాలేదు.
అందుకే స్పిరిట్ లేట్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ది రాజా సాబ్ చిత్రీకరణ పూర్తైనట్లు తెలుస్తోంది. కానీ ఫౌజీ మూవీకి సంబంధించి మాత్రం భారీ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని సమాచారం. ఇంతలో సందీప్ రెడ్డి వంగా.. నెలాఖరులో స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తాజాగా అనౌన్స్ చేశారు.
అయితే ఫస్ట్ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొంటారా లేదా అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. చాలా మంది మాత్రం డౌటేనేనని అంటున్నారు. ఎందుకంటే సందీప్ వంగా.. ముందు నుంచి కూడా ప్రభాస్ లుక్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందని చెబుతూనే ఉన్నారు. ఎప్పటి వరకు ఎన్నడూ చూడని అవతార్ లో చూపిస్తానని పలుమార్లు చెప్పారు.
కానీ ఇప్పుడు ప్రభాస్ లైనప్ లోని ఫౌజీ షూటింగ్ పెండింగ్ లో ఉంది. ఆ సినిమాలోని డార్లింగ్ లుక్.. స్పిరిట్ మూవీలోని లుక్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి రెండు లుక్స్ లో వెంట వెంటనే మారడం కుదరని పని. కాబట్టి స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వడం మాత్రం నిజం అయ్యుండొచ్చు. కానీ ప్రభాస్ తొలి షెడ్యూల్ లో పాల్గొంటారనేది మాత్రం కచ్చితంగా చెప్పలేం. మరేం జరుగుతుందో.. సందీప్ వంగా ప్లాన్ ఎలా ఉందో వేచి చూడాలి.