డార్లింగ్ ఏడు నెలలు రాసిచ్చేసాడా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ `స్పిరిట్` కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. 'రాజాసాబ్', 'పౌజీ' చిత్రాల షూటింగ్ ఓ కొలిక్కి రావడంతో డార్లింగ్ `స్పిరిట్` కి సన్నధం అవుతున్నాడు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'స్పిరిట్` కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. 'రాజాసాబ్', 'పౌజీ' చిత్రాల షూటింగ్ ఓ కొలిక్కి రావడంతో డార్లింగ్ `స్పిరిట్` కి సన్నధం అవుతున్నాడు. అటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేర్చాడు. హీరోయిన్ సహా టెక్నికల్ టీమ్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసాడు. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ మొదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా షూ టింగ్ మొదలు పెట్టిన నాటి నుంచి పూర్తయ్యే వరకూ ప్రభాస్ మరో సినిమా చేయడానికి అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్-సందీప్ మధ్య ఆ రకంగా అగ్రిమెంట్ జరిగినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇదంతా అవాస్తవ మన్నది తాజా అప్ డేట్. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏడు నెలలు మాత్రమే కాల్షీట్లు ఇచ్చా డుట. తదుపరి మొదలయ్యే సినిమాలకు అనుగుణంగా ప్రభాస్ కాల్షీట్లు రెడీ చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ మొదలైన నాటి నుంచి ప్రభాస్ పోర్షన్ కు సంబంధించి షూట్ అంతా పూర్తయ్యేలా సందీప్ కూడా తన ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నట్లు తెలిసింది.సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ మొదలవుతుందని సందీప్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
కానీ సెప్టెంబర్ కు బధులు ఆక్టోబర్ నుంచి మొదలు పెట్టాలన్నది తాజా ప్లాన్ లో భాగంగా తెరపైకి వస్తోం ది. అంటే మే వరకూ ప్రభాస్ పై పోర్షన్ కు సంబంధించి చిత్రీకరణ జరుగుతోంది. ప్రభాస్ తో పాటు ఉన్న కాంబినేషన్ నటులందర్నీ ఆ విధంగానే సందీప్ డేట్లు సర్దుబాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారం. అప్పటికీ ప్రభాస్ తో సీన్స్ బ్యాలెన్స్ ఉంటే గనుక వాటిని జూన్ లో షూట్ చేస్తారుట. ప్రభాస్ `కల్కి 2898`కు డేట్లు జులై నుంచి కేటాయిస్తున్నారు? అన్నది మరో అప్ డేట్.
ఇలా ఈ రెండు సినిమాలను ప్రభాస్ ముందుగా పూర్తి చేసి రిలీజ్ చేయాలన్నది ప్లాన్ గా కనిపిస్తుంది. `కల్కి 2` షూటింగ్ కి ప్రభాస్ ఎక్కువగానే సమయం కేటాయించాలి. అయితే తొలి భాగానికి తీసుకున్నంత సమయం పార్ట్ కి 2 తీసుకోమని నాగీ ఆ మధ్య ఓ సమావేశంలో తెలిపారు. వీటన్నింటికి అనుగుణగానే ప్రభాస్ డేట్లు కేటాయిస్తున్నాడు. `కల్కీ2` పూర్తయిన వెంటనే `సలార్ 2` మొదలయ్యే అవకాశాలున్నాయి.