స్పిరిట్ కోసం సందీప్ మాస్టర్ ప్లాన్.. యాక్షన్ ఎపిసోడ్స్‌కే 2 నెలలు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటైన స్పిరిట్ పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి.;

Update: 2026-05-11 09:43 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటైన స్పిరిట్ పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికే దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త షూటింగ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుందన్న సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. దాదాపు రెండు నెలల పాటు ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేయడానికి మేకర్స్ స్పెష‌ల్ ప్లాన్స్ ను రెడీ చేసినట్టు సమాచారం.

సందీప్ రెడ్డి వంగా సినిమాలకు ప్రత్యేకమైన ఎమోషన్, రా యాక్షన్, ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఇప్పుడు అదే స్టైల్‌ను మరింత భారీ స్థాయిలో స్పిరిట్ కోసం ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే స్వయంగా సందీప్ రెడ్డి వంగా వెల్లడించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇప్పటివరకు మాస్ యాక్షన్ హీరోగా అనేక షేడ్స్‌లో కనిపించిన ప్రభాస్, ఇప్పుడు ఖాకీ డ్రెస్‌లో ఎలా కనిపిస్తారన్నది అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను పెంచుతోంది. ముఖ్యంగా వంగా స్టైల్‌లో పోలీస్ పాత్ర అంటే అది సాధారణ కమర్షియల్ హీరో ఎలివేషన్ కాదని, పాత్ర ప‌రంగా కూడా బలమైన, ఇంటెన్స్ క్యారెక్టర్ అయి ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ నటిస్తుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఆమె చేస్తున్న మరో సినిమా కావడంతో ఈ జంటపై కూడా ఆసక్తి నెలకొంది. అలాగే విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నారన్న వార్తలు యాక్షన్ పార్ట్‌కు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. ప్రభాస్- వివేక్ ఒబెరాయ్ మధ్య సాగే యాక్షన్ ఎపిసోడ్స్‌ను హాలీవుడ్ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కించేందుకు ప్రత్యేక టీమ్ పనిచేస్తోందని టాక్ వినిపిస్తోంది. భారీ సెట్లు, రియలిస్టిక్ ఫైట్స్, హై ఓల్టేజ్ ఛేజింగ్ సీన్స్ ఈ షెడ్యూల్‌లో ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయని అంటున్నారు.

ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన స్పిరిట్ సినిమాను సందీప్ రెడ్డి వంగా తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపొందిస్తున్నట్టు సమాచారం. ప్రభాస్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రెజెంట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. సలార్, కల్కి లాంటి భారీ సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మరో ఇంటెన్స్ యాక్షన్ సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ పోలీస్ అవతార్, వంగా టేకింగ్, వివేక్ ఒబెరాయ్ విలనిజం కలిసి స్పిరిట్‌ను ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక డిఫరెంట్ యాక్షన్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News