స్పిరిట్ టికెట్ వర్త్.. ఒక్క ఎంట్రీ సీన్ తోనే..?
యానిమల్ తర్వాత సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు.;
యానిమల్ తర్వాత సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రిని సెలెక్ట్ చేసుకున్నారు. ఐతే ఈ సినిమా కోసం సందీప్ వంగ ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉందని తెలుస్తుంది. సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ కోసమే ఒక భారీ సెట్ ని ఏర్పాటు చేస్తున్నారట. ఆ సీన్ కోసం సందీప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ తో రకరకాల చర్చలు జరిపారట.
సందీప్ వంగ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్..
చిత్ర యూనిట్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే స్పిరిట్ లో ప్రభాస్ ఎంట్రీ సీన్ చూస్తేనే టికెట్ వర్తీ అనిపించేలా ఉంటుందట. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కి ఇచ్చే ఎలివేషన్స్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయట. సందీప్ వంగ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఇదివరకు ఎప్పుడు చూడని ఆ హీరో ఇమేజ్ కి సెపరేట్ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. అలాంటి క్యారెక్టర్ లో రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తే ఇక ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే.
ప్రభాస్ మాస్ స్టామినాను సందీప్ వంగ తన మార్క్ విజువల్ ట్రీట్ గా చూపించనున్నారు. సినిమాను మొదలు పెట్టడమే ఆలస్యం ఆరు నెలల్లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముగించాలని చూస్తున్నారు. ప్రభాస్, త్రిప్తి రొమాన్స్ కూడా సినిమాకు హైలెట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆల్రెడీ సినిమాకు సాంగ్స్ తో పాటు బిజిఎం కూడా పూర్తైనట్టు తెలుస్తుంది.
రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి స్పెషల్ సర్ ప్రైజ్..
ప్రభాస్ స్పిరిట్ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్. ప్రభాస్ బలం ఏంటో తెలుసు కాబట్టి దాన్ని ఫ్యాన్స్ కి మరింత ఎంజాయ్ చేసేలా విజిల్ మూమెంట్స్ ని ప్లాన్ చేస్తున్నారట సందీప్ వంగ. సో ఈ సినిమా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న స్పిరిట్ సినిమాను 2027 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ప్రభాస్ వరుస సినిమాల బిజీలో స్పిరిట్ కు కావాల్సిన డేట్స్ ఇస్తే మాత్రం సందీప్ వంగ తన పని తాను కానిచ్చేస్తాడని చెప్పొచ్చు.
ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ రెండు సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లానింగ్ ఉండగా.. స్పిరిట్ 2027 లో తప్పకుండా రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉంది. సందీప్ వంగ కూడా స్పిరిట్ తర్వాత మరో టాలీవుడ్ స్టార్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. చరణ్, అల్లు అర్జున్, మహేష్ ఇలా స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా సందీప్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.