రేసులో రాజా సాబ్ ఉన్నట్టే..!
రెబల్ స్టార్ రాజా సాబ్ సినిమా అసలైతే ఈ ఇయర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ ఫిక్స్ చేశారు.;
రెబల్ స్టార్ రాజా సాబ్ సినిమా అసలైతే ఈ ఇయర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ ఫిక్స్ చేశారు. కానీ ఫ్యాన్స్ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తే బాగుంటుందని కోరగా మేకర్స్ వాళ్ల కోరిక మేరకు జనవరిలో సినిమా రిలీజ్ లాక్ చేశారు. 2026 జనవరి 9న రాజా సాబ్ రిలీజ్ లాకైంది. ఐతే ఈసారి సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ తో పాటు రవితేజ కిషోర్ తిరుమల సినిమా.. శర్వానంద్ నారి నారి నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాల మధ్య స్టార్ ఫైట్ షురూ కానుంది.
రాజా సాబ్ రిలీజ్ అనౌన్స్...
ఐతే ముందు రాజా సాబ్ జనవరి రిలీజ్ అని అనౌన్స్ చేసినా సరే మళ్ళీ ఈమధ్య సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని సినిమాను మళ్లీ సమ్మర్ కి వాయిదా వేస్తారన్న టాక్ వచ్చింది. కానీ మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఐతే గురువారం ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రాజా సాబ్ రిలీజ్ ని మరోసారి అనౌన్స్ చేశారు. సినిమా పోస్టర్ లో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రభాస్ వింటేజ్ లుక్ ని మాత్రమే కాదు రిలీజ్ ప్రకటనకు సూపర్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ అనుకున్న విధంగానే జనవరి 9న రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ విషయంలో ఈసారి ఎలాంటి డౌట్లు పడాల్సిన అవసరం లేదు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాను థ్రిల్లర్ జోనర్ లో గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైం ఇలాంటి అటెంప్ట్ చేస్తున్నారు. ఐతే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచాయి.
కామెడీ టైమింగ్ తో పాటు వింటేజ్ ప్రభాస్ ఎంటర్టైనింగ్..
ప్రభాస్ రాజా సాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటించారు. సినిమాలో థ్రిల్లింగ్ అంశాలతో పాటుగా ప్రభాస్ హీరోయిన్స్ తో చేసే రొమాంటిక్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయని అంటున్నారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ తో పాటు వింటేజ్ ప్రభాస్ ఎంటర్టైనింగ్ ని ఈ సినిమాలో చూస్తామని తెలుస్తుంది. ఐతే జనవరిలో అదే సంక్రాంతి రిలీజ్ ఉంటుందా లేదా అని కన్ ఫ్యూజన్ లో ఉన్న ఫ్యాన్స్ కి ప్రభాస్ బర్త్ డే పోస్టర్ తో మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సో సంక్రాంతికి ఎవరు వచ్చినా రాకపోయినా రాజా సాబ్ ఆగమనం జరుగుతుందని చెప్పొచ్చు.