రాజా సాబ్ మీదే ఆ ఇద్దరి హోప్స్..?

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది.;

Update: 2025-08-28 16:06 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమాను మారుతి చాలా పెద్ద ప్లానింగ్ తోనే చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది. సినిమా టీజర్ లోనే ఈ ఇద్దరి పాత్రలను ఇంట్రడ్యూస్ చేశాడు మారుతి. సో తప్పకుండా ఈ ఇద్దరికి సినిమాలో మంచి రోల్స్ పడినట్టు ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ తో ఛాన్స్ కాబట్టి కచ్చితంగా ఈ ఇద్దరికి మంచి ఛాన్స్ ఉంటుంది.

రాజా సాబ్ తోనే అమ్మడు హిట్ టార్గెట్..

ఐతే నిధి అగర్వాల్ విషయానికి వస్తే ఈమధ్యనే హరి హర వీరమల్లు సినిమాతో వచ్చింది. ఆ సినిమాలో తన రోల్ లెంగ్త్ ఎలా ఉన్నా ఉన్నంతలో ఓకే అనిపించింది. ఐతే రాజా సాబ్ తోనే అమ్మడు హిట్ టార్గెట్ పెట్టుకుంది. హరి హర వీరమల్లు ప్రమోషన్స్ టైం లో నిధి చాలా కష్టపడింది. మరి ప్రభాస్ రాజా సాబ్ కోసం కూడా అదే తరహాలో ప్రమోషన్స్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఐతే ప్రభాస్ రాజా సాబ్ తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది అమ్మడు.

ఇక మలయాళ భామ మాళవిక మోహనన్ ని చూస్తే.. ఇప్పటికే తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తుంది అమ్మడు. ఐతే తెలుగులో తనకు ఇదే తొలి సినిమా.. ఈ సినిమాతో అమ్మడు తెలుగు ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తుంది. సినిమాలే కాదు ఫోటో షూట్స్ తో కూడా మెప్పిస్తున్న మాళవిక మోహనన్ రాజా సాబ్ హిట్ పడితే మాత్రం తెలుగులో మరిన్ని ఛాన్స్ లు రాబట్టుకుంటుంది.

మ్యూజిక్ కూడా సంథింగ్ స్పెషల్..

నిధి అగర్వాల్, మాళవిక ఈ ఇద్దరు కూడా రాజా సాబ్ తో తమ లక్ టెస్ట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ ఇద్దరు అందాల భామలు కూడా ఈ సినిమా మీదే హోప్స్ పెట్టుకున్నారు. మరి మారుతి ఈ ఇద్దరిని ఎలా ప్లాన్ చేశాడో చూడాలి. రాజా సాబ్ సినిమా నిన్నటిదాకా డిసెంబర్ 5కి రిలీజ్ అని చెప్పగా లేటెస్ట్ గా సినిమాను సంక్రాంతి బరిలో దించుతున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. రాజా సాబ్ సినిమాకు థమన్ ఇస్తున్న మ్యూజిక్ కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుంది. తప్పకుండా ఈ మూవీపై థమన్ కూడా తన మార్క్ సెట్ చేస్తాడని చెప్పొచ్చు. రాజా సాబ్ సినిమా 2026 సంక్రాంతికి మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ తో పాటుగా మరో రెండు సినిమాలతో పోటీ పడుతుంది.

Tags:    

Similar News