రాజా సాబ్ ఫ్యాన్ ఫీస్ట్.. ప్లానింగ్ పీక్స్ అంతే..!
రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ ఫిక్స్ చేశారు.;
రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. సంక్రాంతి బరిలో ప్రభాస్ తన స్టామినా చూపించాలని దిగుతున్నాడు. ఆల్రెడీ సంక్రాంతికి ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ షెడ్యూల్ చేశాయి. ఐతే రాజా సాబ్ తో ఆ సినిమాలు పోటీ పడక తప్పదు. మారుతి డైరెక్షన్ లో హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో వస్తుంది రాజా సాబ్. టీజర్ తోనే సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించేశాడు మారుతి. రాజా సాబ్ కి థమన్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ఉంటుందనిపిస్తుంది.
ప్రభాస్ ఎలివేషన్స్ పీక్స్..
రాజా సాబ్ సినిమా ఫ్యాన్ ఫీస్ట్ పక్కా అనేస్తున్నారు మేకర్స్. సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ తో పాటు ఆయనకు ఇచ్చే ఎలివేషన్స్ ఇంకా స్క్రీన్ ప్లే అన్నీ కూడా రెబల్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు ఆడియన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తాయట. ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సాంగ్ ని కూడా ఒక ర్యాప్ సాంగ్ గా ప్లాన్ చేస్తున్నారట. థమన్ ఈ సాంగ్ ని డిఫరెంట్ గా డిజైన్ చేశాడని టాక్.
రాజా సాబ్ సినిమాలో థమన్ బాలీవుడ్ ఓల్డ్ క్లాసిక్ సాంగ్ ఒకటి రీమిక్స్ చేస్తాడన్న టాక్ వచ్చింది. అది ఉందో లేదో తెలియదు కానీ ప్రభాస్ ఎంట్రీ సాంగ్ మాత్రం ర్యాపర్ సూరజ్ చెరుకత్ తో పాడిస్తున్నాడట. ఆల్రెడీ సాంగ్ కంపోజింగ్ పూర్తవగా త్వరలో షూట్ చేస్తారట. ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్ గా చేస్తున్నారు.
హర్రర్ జోనర్ లోనే కొత్త అటెంప్ట్..
రాజా సాబ్ సినిమా హర్రర్ జోనర్ లోనే కొత్త అటెంప్ట్ అని అంటున్నారు. మారుతి మార్క్ కామెడీ మిస్ అవ్వదని టీజర్ తోనే చూపించారు. ఇక రెబల్ ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలైతే కొదవ ఉండదని టాక్. ఏది ఏమైనా మారుతి రాజా గారి ఇమేజ్ కి తగ్గట్టుగానే రాజా సాబ్ ని చేస్తున్నాడని అనిపిస్తుంది. ప్రభాస్ రాజా సాబ్ సంక్రాంతికి వస్తుంటే హనుతో చేస్తున్న సినిమా సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ లో రిలీజ్ ఉంటుందట. ఇక సందీప్ వంగతో చేసే స్పిరిట్ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీగా ఉంది. ప్రభాస్ డేట్స్ కోసమే సందీప్ వెయిటింగ్ అని టాక్. ఇదే కాకుండా మరో 3 సినిమాలు ప్రభాస్ లైన్ లో ఉన్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రీసెంట్ గా మిరాయ్ తో సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత రాజా సాబ్ ఆ హిట్ జోష్ ని కొనసాగించేలా ఉంది.