ఫారిన్ లో మారుతి.. ప్రభాస్ వెళ్తే పని అయినట్లే!
ఇప్పటికే మేకర్స్ టీజర్ లో సినిమాలో మంచి కామెడీ ఉన్నట్టు చూపించారు. అదే సమయంలో ప్రభాస్ లుక్స్, యాక్షన్, డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. సినిమాపై అంచనాలు కూడా క్రియేట్ చేశాయి.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. లైనప్ లో వివిధ సినిమాలు ఉండగా.. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో థియేటర్స్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ రాజా సాబ్ తో సందడి చేయనున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమాను టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తుండగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే మారుతి సినిమాల్లో నార్మల్ గా ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు. ఇప్పుడు రాజా సాబ్ లో కూడా ఫుల్ గా ఉండనున్నట్లు క్లారిటీ వచ్చేసింది.
ఇప్పటికే మేకర్స్ టీజర్ లో సినిమాలో మంచి కామెడీ ఉన్నట్టు చూపించారు. అదే సమయంలో ప్రభాస్ లుక్స్, యాక్షన్, డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. సినిమాపై అంచనాలు కూడా క్రియేట్ చేశాయి. దీంతో మూవీ కోసం సినీ ప్రియులు, ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. రెండు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి.
ఆ పాటల చిత్రీకరణ కనుక కంప్లీట్ అయిపోతే షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నారు మేకర్స్. ఇప్పుడు వాటిని షూట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గ్రీస్ దేశానికి మారుతి అండ్ టీమ్ వెళ్లింది. షూటింగ్ లొకేషన్స్ ను సెర్చ్ చేస్తోంది. వచ్చే నెలలో ప్రభాస్ గ్రీస్ వెళ్లనున్నారు. ఆ తర్వాత సాంగ్స్ షూట్ చేయనున్నారు.
గ్రీస్ లోని వివిధ అందమైన ప్రదేశాల్లో ఆ రెండు పాటలను మేకర్స్ చిత్రీకరణ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఆ సాంగ్స్.. సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని సమాచారం. అభిమానులను విపరీతంగా అలరిస్తాయని వినికిడి. మొత్తానికి ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్.. రాజా సాబ్ రూపంలో చేరనుందని ఇప్పటికే అంతా ఫిక్సయ్యారు.
అదే సమయంలో రాజా సాబ్.. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ సంక్రాంతికి విడుదలవ్వనుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్మాత విశ్వప్రసాద్ ఓ కార్యక్రమంలో.. జనవరి 9వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం.