ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తున్న ఫౌజి లుక్
ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమాను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ లైనప్ లో పలు క్రేజీ ప్రాజెక్టులుండగా అందులో ఆయన ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలను చేస్తున్నారు. ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమాను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు.
తన కెరీర్లోనే మొదటిసారి హార్రర్ కామెడీ థ్రిల్లర్ ను చేస్తున్న ప్రభాస్, ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ప్రభాస్ ను మారుతి ప్రెజెంట్ చేసిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. వింటేజ్ ప్రభాస్ లుక్స్ తో పాటూ రీసెంట్ గా వచ్చిన ది రాజా సాబ్ టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచడంతో ఎప్పుడెప్పుడు రాజా సాబ్ ను చూస్తామా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఓ వైపు రాజా సాబ్ ను రిలీజ్ కు రెడీ చేస్తూనే ప్రభాస్ మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి సినిమా షూటింగులో కూడా పాల్గొంటున్నారు. ఫౌజీలో ప్రభాస్ ఓ సోల్జర్ పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే పలు వార్తలు రాగా, ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందోనని డార్లింగ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే తాజాగా ఫౌజీ సెట్స్ నుంచి నుంచి ప్రభాస్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి.
లీకైన ఫోటోల్లో ప్రభాస్ లుక్స్ మిర్చి సినిమాను పోలి ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా హను ప్రభాస్ ను మిర్చి లుక్స్ లో చూపిస్తే మాత్రం అతని ఫ్యాన్స్ కు కన్నుల పండుగేనని చెప్పాలి. ప్రభాస్ కెరీర్లోనే బెస్ట్ లుక్స్ అంటే మిర్చి సినిమాలోనే. ఇప్పుడు మరోసారి హను ప్రభాస్ ను అలా చూపిస్తే అభిమానులకు అంతకంటే ఏం కావాలి? మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఫౌజీలో ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్ గా పరిచయం కానుండగా విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.