ప్రభాస్ కు రెండు రోజుల టెన్షన్!
ప్రభాస్ చిత్ర పరిశ్రమకొచ్చి దాదాపు పాతికేళ్లు అవుతుంది. నటుడిగా చాలా సినిమాలు చేసారు.;
ప్రభాస్ చిత్ర పరిశ్రమకొచ్చి దాదాపు పాతికేళ్లు అవుతుంది. నటుడిగా చాలా సినిమాలు చేసారు. వాటిలో రకరకాల పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించారు. ఎంతో మంది హీరోయిన్ల సరసన నటించారు. మరెంతో మంది దర్శకులు, నిర్మాతలతో కలిసి పని చేసారు. ఎన్నో సినిమా షూటింగ్ ల్లో పాల్గొన్నారు. అలాగే ఆ సినిమాలకు సంబంధించిన ఈవెంట్లకు హాజరయ్యారు. జనాలు ఎంత మంది ఉన్నా? వాళ్లు ముందు ధైర్యంగా నిలబడి మాట్లాడిన సందర్భా లెన్నో. ఇలా ఇంత అనుభవం ఉన్న స్టార్ కి కొత్త సినిమాలో నటించడం అంటే? కొత్తగా ఉత్సాహం వచ్చే పరిస్థితి ఉండదంటారు.
`బాహుబలి`కి రెంట్టింపు టెన్షన్:
ఎలాంటి బెణుకు లేకుండా షూటింగ్ ల్లో పాల్గొంటారు. కానీ ప్రభాస్ కి మాత్రం తాను ఏ సినిమా చేసినా? మొదటి రెండు రోజులు టెన్షన్ ఉంటుందట. సెట్స్ కు వెళ్లగానే కాళ్లు చేతులు ఒణుకుతాయన్నారు. కెమెరా ముందుకు వెళ్లగానే ఆ టెన్షన్ రెట్టింపు అవుతుందన్నారు. ఇలా రెండు రోజుల పాటు ఏ సినిమాకైనా ఇబ్బంది పడతానన్నారు. ఆ తర్వాత అక్కడ వాతావరణమంతా అలవాటు పడితే పని మామూలుగానే ఉంటుందన్నారు. ఎన్ని సినిమాలు చేసినా? ఏ సినిమాకైనా ఇది కామన్ గా మారిపోయిందన్నారు. `బాహుబలి` సినిమా సమయంలో కూడా ఇలా టెన్షన్ పడినట్లు గుర్తు చేసుకున్నారు.
కొత్త నటులతో ఇబ్బందే:
మరికొంత మంది స్టార్లకు ఆరంభ సమస్య ఉంటుంది. కొత్త సినిమా మొదలైన మొదటి రోజు షూటింగ్ కి వెళ్లాలన్నా? వెళ్లిన తర్వాత ఎలా పని చేయాలి? అని ఆలోచనలో పడి గందరగోళానికి గురవుతారు. కెమెరా ముందు సరిగ్గా పెర్పార్మెన్స్ చేయలేరు. ఆ సమయంలో ఎన్ని టేక్ లు తీసుకుంటారో? లెక్క కూడా ఉండదు. అప్పుడే దర్శకులు కూడా అసహనాకి గురై నటీనటులు పై కేకలు వేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కొత్త నటీనటులు చూస్తుంటారు. కెమెరా..ఆన్ సెట్స్ కొంత కాలం పాటు అలవాటు అయ్యే వరకూ దర్శకులకు కొత్త వాళ్లతో ఇలాంటి ఇబ్బందులు తప్పవు.
అందుకే ఆయన మెగాస్టార్:
అయితే సినిమాలంటే విపరీతమైన ఫ్యాషన్ ఉన్న నటులు మాత్రం ఎన్ని సినిమాల్లో నటించినా? కొత్త సినిమా మొదలవుతుందంటే ఒకే ఉత్సాహంతో పని చేస్తుంటారు. ఆ సినిమాని తొలి సినిమాగానే భావిస్తుంటారు. ఈ మాట ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి చెబుతుంటారు. కెమెరా ముందుకు వెళ్లే ముందు తనని తాను ఒకసారి చెక్ చేసుకునే వెళ్తానంటారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు.