ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ నిరుత్సాహంలోనా?

టాలీవుడ్ అగ్ర కథానాయకులు రెబల్ స్టార్ ప్రభాస్- సూపర్ స్టార్ మహేష్ ల‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2026-05-18 07:57 GMT

టాలీవుడ్ అగ్ర కథానాయకులు రెబల్ స్టార్ ప్రభాస్- సూపర్ స్టార్ మహేష్ ల‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్లాది మంది అభిమానించే అగ్ర తార‌లు ఇద్ద‌రు. మ‌హేష్ పాన్ ఇండియా సినిమా చేయ‌క‌పోయినా? ఆ రేంజ్ లో అభిమానుల్ని ఇప్ప‌టికే సంపాదించుకున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్-మ‌హేస్ ల నుంచి సినిమా వ‌స్తుందంటే? అంచ‌నాలు వేరే లెవ‌ల్లో ఉంటాయి. అలాంటి స్టార్లు ఇద్ద‌రు అభిమానుల‌ను నిరాశలోకి నెట్టేస్తున్నారు. ఇద్ద‌రు న‌టిస్తోన్న సినిమాల నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేక‌పోవ‌డంతో నిరుత్సాహంలో మునిగిపోతున్నారు.

ఎంతగా ఎదురు చూస్తున్నా? ప్రొడక్షన్ హౌస్‌ల నుండి ఎలాంటి అధికారిక సమాచారం రాకపోవడంతో ఫ్యాన్స్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఏ హీరోకైనా అసూయ కలగక మానదు. ప్రస్తుతం ప్ర‌భాస్ వ‌రుస‌గా మూడు సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` చాలా వ‌ర‌కూ షూటింగ్ పూర్త‌యింది. కానీ అప్ డేట్స్ ఇవ్వ‌డానికి మేక‌ర్స్ ఎంత మాత్రం ఆస‌క్తిగా లేరు. తాము ఏం చేసినా రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డితే త‌ప్ప చేయ‌లేం అంటున్నారు.

అలాగే సందీప్ రెడ్డి వంగాతో మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా `స్పిరిట్` విష‌యంలోనూ ఇదే ప‌రిస్థితి. సందీప్ కూడా ఫ్యాన్స్ కు నిరాశ‌ప‌రుస్తున్నాడు. అప్ డేట్స్ ఇవ్వ‌డంలో సందీప్ కూడా చాలా విష‌యాలు ఆలోచిస్తాడు. మ‌రోవైపెఉ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో `క‌ల్కి 2` తెర‌కెక్కుతోంది. ఇలా మూడు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నా? అప్ డేట్స్ మాత్రం క‌రువుగా మారాయి. ఇది డార్లింగ్ అభిమానుల్ని తీవ్ర నిరాశ‌కు గురి చేస్తోంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ అభిమానుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ న‌టిస్తోన్న‌ `వార‌ణాసి` అనే గ్లోబల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా పై అంచనాలు ఇప్ప‌టికే ఆకాశాన్ని తాకాయి.

ఈ సినిమా కోసం మహేష్ జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో కఠినమైన ట్రెకింగ్ ట్రైనింగ్స్ తీసుకుంటున్నాడు. దీనికి సంబంధించి నెట్టింట లీక్ అయిన సమాచారం త‌ప్ప అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ట్రెండ్స్ చాలా కీలకం. ప్రతీ చిన్న విషయానికి అప్‌డేట్స్ ఇస్తూ హైప్ క్రియేట్ చేయడం ఇతర చిత్ర యూనిట్లకు అలవాటుగా మారింది. కానీ ప్రభాస్, మహేష్ చిత్రాల మేకర్స్ మాత్రం సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అనే సూత్రాన్ని పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. షూటింగ్ పనులు నిశ్శబ్దంగా పూర్తి చేసుకుని ఒకేసారి ఊహించని సర్ప్రైజ్‌లతో ప్రేక్షకుల ముందుకు రావాలనేది ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల వ్యూహం కావొచ్చు.

Tags:    

Similar News