వంగా 'జైలు'లో ప్రభాస్
డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా ఒక 'జైలు'లో బందీ అయిపోయాడు.;
డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా ఒక 'జైలు'లో బందీ అయిపోయాడు. అది మామూలు జైలు కాదు, క్రేజీ డైరెక్టర్ సృష్టించిన వైల్డ్ వరల్డ్. ఇన్నాళ్లు రకరకాల షూటింగులతో బిజీగా ఉన్న ప్రభాస్, ఇప్పుడు సడెన్ గా ఒకే చోట లాక్ అయిపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
మామూలుగా స్టార్ హీరోలు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తుంటారు. కానీ ఈ డైరెక్టర్ రూటే సెపరేటు. ఆయన కాంపౌండ్ లోకి వస్తే, బయటి ప్రపంచంతో సంబంధం కట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ప్రభాస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇన్నాళ్లు అటు ఇటు తిరిగిన డార్లింగ్, ఇప్పుడు ఒక రాపిడ్ ఫైర్ షెడ్యూల్ కోసం పూర్తిగా సరెండర్ అయిపోయాడు.
అసలు విషయం ఏంటంటే.. సందీప్ రెడ్డి వంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' సెట్స్ లోకి ప్రభాస్ ఈరోజే అడుగుపెట్టాడు. మొన్నటి వరకు రాజా సాబ్, ఫౌజీ సినిమాల కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తూ షూటింగ్స్ లో బిజీగా గడిపాడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేవలం సీరియస్ పోలీస్ గానే కాకుండా, ఖైదీగా కూడా ప్రభాస్ కనిపించబోతున్నాడని రీసెంట్ గా వచ్చిన డార్క్ ఆడియో టీజర్ తో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అదే ఇంటెన్సిటీతో షూటింగ్ మొదలైంది.
వాస్తవానికి ఈ సినిమాకు కూడా ప్రభాస్ మిగతా సినిమాల్లాగే డేట్స్ అడ్జస్ట్ చేద్దామని అనుకున్నాడట. కానీ సందీప్ వంగా మాత్రం దానికి ఒప్పుకోలేదు. లుక్ విషయంలో, క్యారెక్టర్ మూడ్ విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉండే వంగా.. తనకు బల్క్ డేట్స్ కావాల్సిందేనని పట్టుబట్టాడట. కల్ట్ మాస్టర్ పీస్ రావాలంటే ఆ మాత్రం డెడికేషన్ అవసరమని, ఆ లుక్ మెయింటైన్ చేయడం ముఖ్యమని ప్రభాస్ కూడా ఫిక్స్ అయ్యాడు.
దీంతో మొత్తానికి ప్రభాస్ బల్క్ డేట్స్ ఇచ్చేసి సందీప్ వంగా జైలులోకి ఎంట్రీ ఇచ్చేశాడు. రాబోయే రెండు నెలల పాటు ప్రభాస్ పూర్తిగా వంగా కాంపౌండ్ లోనే ఉండబోతున్నాడు. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఎమోషనల్ సీన్స్ ను కూడా చిత్రీకరించే ప్లాన్ లో ఉన్నారు. వంగా పని మొదలుపెట్టాడంటే, అవుట్ పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఏదేమైనా ప్రభాస్ కటౌట్ కు వంగా మార్క్ వైలెన్స్ తోడైతే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. ఇన్నాళ్లు వెయిట్ చేసిన దానికి ఫలితం దక్కేలా, ఒక కల్ట్ క్లాసిక్ ను అందించడానికి ఈ ఇద్దరూ కసిగా పని చేస్తున్నారు. ఇక నుంచి స్పిరిట్ అప్డేట్స్ తో సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం.