వరుసగా బిగ్ ప్రాజెక్ట్స్ ప్లాన్‌లో హోంబలే.. ప్రభాస్ కాంబోపై బజ్!
ఇండియన్ సినిమా లో కేజీఎఫ్', 'సలార్', 'కాంతార' వంటి సంచలన విజయాలతో ఇండస్ట్రీలోనే అగ్రగామి నిర్మాణ సంస్థగా ఎదిగిన 'హోంబలే ఫిల్మ్స్' రాబోయే రోజుల్లో మరింత భారీ ప్లానింగ్‌తో సిద్ధమవుతోంది.
ఇండియన్ సినిమా లో కేజీఎఫ్', 'సలార్', 'కాంతార' వంటి సంచలన విజయాలతో ఇండస్ట్రీలోనే అగ్రగామి నిర్మాణ సంస్థగా ఎదిగిన 'హోంబలే ఫిల్మ్స్' రాబోయే రోజుల్లో మరింత భారీ ప్లానింగ్‌తో సిద్ధమవుతోంది. బ్యాక్ టు బ్యాక్ పాన్-ఇండియా రేంజ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌లను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి లైన్ అప్ సెట్ చేస్తోంది. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్‌తో మరో మైండ్ బ్లావింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు సిద్ధమవ్వడంతో సినీ ప్రియుల్లో భారీగా ఆసక్తి నెలకొంది.
ప్రభాస్-హోంబలే కాంబోలో మరో మాసివ్ అనౌన్స్‌మెంట్:
సలార్ గ్రాండ్ సక్సెస్ తర్వాత ప్రభాస్, హోంబలే ఫిల్మ్స్ కాంబినేషన్‌కు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పటికే ఈ కాంబోలో కొత్త సినిమాకి సంబంధించిన కాల్ షీట్స్ చాలా కాలం క్రితమే లాక్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం సరైన స్క్రిప్ట్‌లను పరిశీలిస్తున్న టీమ్, త్వరలోనే ఒక మైండ్ బ్లోయింగ్ ప్రకటనతో ముందుకు రాబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ప్రభాస్ లైనప్ అండ్ బిజీ షెడ్యూల్:
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'ఫౌజీ' చిత్ర షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నారు. అందులో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇక దీని తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్', ఆపై 'కల్కి 2' సినిమాలు పూర్తి చేయనున్నారు. వీటి తర్వాతే హోంబలే మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ :
కేవలం ఒక్క ప్రభాస్ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా పౌరాణిక కథాంశాలు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్' పై కూడా హోంబలే ఫోకస్ పెట్టింది.ఇక మన భారతీయ సంస్కృతి, పురాణాల ఆధారంగా అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో సరికొత్త పౌరాణిక ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
భారీ సీక్వెల్స్ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ :
ఇప్పటికే హోంబలే బ్యానర్‌లో 'సలార్ 2' (శౌర్యాంగ పర్వం) వంటి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మరికొన్ని భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. ఇక దీంతో హోంబలే నుంచి రాబోయే ప్రతి సినిమాపై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
హోంబలే ఫిల్మ్స్ విజన్, ప్రభాస్ స్టార్‌డమ్ కలసి వస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయం. భారతీయ సినిమా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్న ఈ కాంబో అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.