కల్కి 2 ముందుకొచ్చింది.. ఆ రెండిటితో పాటే రెబల్ ప్లానింగ్..?

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయడంలో విఫలమైంది. మారుతి ఈ సినిమా కోసం ఎంత కష్టపడినా కూడా రెబల్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయలేకపోయాడు.;

Update: 2026-01-28 08:30 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయడంలో విఫలమైంది. మారుతి ఈ సినిమా కోసం ఎంత కష్టపడినా కూడా రెబల్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయలేకపోయాడు. రాజా సాబ్ రిలీజ్ తర్వాత ప్రభాస్ తన పూర్తి ఫోకస్ నెక్స్ట్ సినిమాల మీద పెడుతున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ సినిమాలు ఉన్నాయి. ఫౌజీ ఆల్రెడీ సగానికి పైగా పూర్తైంది. ఐతే ఈ సినిమాతో పాటు సందీప్ వంగ స్పిరిట్ సినిమా కూడా చేస్తున్నాడు ప్రభాస్.

ప్రభాస్ డేట్స్ ఇస్తే సెట్స్ మీదకు వెళ్లడమే అన్నట్టు..

ఐతే ఈ రెండిటితో పాటు కల్కి 2 కి కూడా ప్రభాస్ డేట్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. కల్కి 2898 ఏడి వచ్చి రెండేళ్లు అవుతుంది. ఆ సినిమా పార్ట్ 2 మీద నాగ్ అశ్విన్ ఇప్పటివరకు వర్క్ చేశాడు. ప్రభాస్ డేట్స్ ఇస్తే సెట్స్ మీదకు వెళ్లడమే అన్నట్టు ఉన్నాడు. ఐతే ఫౌజీ మరో 3 నెలల్లో పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్న ప్రభాస్ ఫౌజీతో పాటు స్పిరిట్ చేస్తూ కల్కి 2 కి కూడా డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నాడట. ఫిబ్రవరి లోనే కల్కి 2 షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడట నాగ్ అశ్విన్.

సో కల్కి 2 కూడా 2027 రిలీజ్ రేసులో ఉండే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ప్రభాస్ సందీప్ వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ ని 2027 మార్చి రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు. సో ఈ సినిమాలతో ప్రభాస్ మరోసారి తన ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అందిచేలా ఉన్నాడు. రాజా సాబ్ కోసం తన ఎఫర్ట్ తాను పెట్టినా రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేసినట్టుగా రాలేదు. అందుకే ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట.

ప్రశాంత్ నీల్ ఫ్రీ అయితే సలార్ 2 ని కూడా..

ఈ 3 సినిమాలతో పాటు ప్రశాంత్ నీల్ ఫ్రీ అయితే సలార్ 2 ని కూడా లైన్ లో పెట్టాలని చూస్తున్నాడు ప్రభాస్. 2027 లో సలార్ 2 సెట్స్ మీదకు వెళ్లినా 2028 లేదా 2029లో ఆ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ నాలుగు సినిమాలు ఆయన మాస్ స్టామినా ఏంటో చూపిస్తాయని చెప్పొచ్చు.

ఫౌజీ, స్పిరిట్ కన్నా కల్కి 2 భారీ బడ్జెట్ తో కొత్త ప్రపంచంలో సినిమా ఉండబోతుంది. అందుకే ఆ సీక్వెల్ మీద రెబల్ ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు. అక్కడ ఉంది నాగ్ అశ్విన్ కాబట్టి తప్పకుండా రెబల్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచేలా చేస్తాడని చెప్పడంలో సందేహం లేదు.

Tags:    

Similar News