ప్రభాస్ ఫౌజీ రిలీజ్ డేట్ లాక్.. ప్లాన్ మామూలుగా లేదుగా!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.;

Update: 2025-10-16 05:49 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో ఒకటి ఫౌజీ.. ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పుడు నిర్మాతలు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ.. క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ నిర్మాతలు మరోవైపు కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తో డ్యూడ్ సినిమాను నిర్మించారు.. ఈ సినిమా రేపు విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్మాతలు ఫౌజీ రిలీజ్ ను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. వచ్చే ఏడాది ఆగస్టు లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పవచ్చు. ఇకపోతే మేకర్స్ మాస్టర్ ప్లాన్ చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా ఎవరైనా సరే తమ సినిమాను విడుదల చేస్తున్నాము అంటే కచ్చితంగా ఆ తేదీలలో ఏవైనా హాలిడేస్ ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని కచ్చితంగా గమనిస్తారు. ఆయా తేదీలు వారికి, తమ సినిమాకు కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. అదేకాదు తమ సినిమా విడుదలయ్యే సమయంలో మరో సినిమా విడుదలవుతోందా? లేదా? అనే విషయాన్ని కూడా గమనిస్తారు. ఈ క్రమంలోనే అన్ని చూసుకొని మరీ నిర్మాతలు ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇకపోతే నిర్మాతలు ఫౌజీ సినిమాను రిలీజ్ చేయాలనుకున్న సమయంలో ప్రభుత్వ సెలవులు కూడా బాగా కలిసి వస్తున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే.. వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ చేస్తామని ప్రకటించారు కాబట్టి ఒకవేళ ఆగస్టు 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తే.. ఆగస్టు15 శనివారం స్వాతంత్ర దినోత్సవం హాలిడే.. అలాగే ఆగస్టు 16న ఆదివారం కావడంతో ఈ సినిమాకి వరుసగా మూడు రోజులు కలిసి వస్తాయి. అలాగే ఆగస్టు 22న వీకెండ్ శనివారం.. ఆగస్టు 23 ఆదివారం.. అలాగే ఆగస్టు 25 మంగళవారం హాలిడే.. ఆగస్టు 28 శుక్రవారం కూడా హాలిడేలు ఉన్నాయి. ఇక ఈ హాలిడేస్ అన్నీ కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఆగస్టు 14న ఫౌజీ గనుక రిలీజ్ అయ్యిందంటే మాత్రం ఈ హాలిడేస్ అన్నింటిని నిర్మాతలు క్యాష్ చేసుకోవచ్చు. మరి ఈ విడుదల తేదీ పై అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Tags:    

Similar News