'స్పిరిట్' నుంచి ప్రభాస్ ముందే బయటకు!
'స్పిరిట్' చిత్రీకరణ మొదలైన నాటి నుంచి ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కే సమయమంతా కేటాయిస్తారు? అన్న ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.;
'స్పిరిట్' చిత్రీకరణ మొదలైన నాటి నుంచి ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కే సమయమంతా కేటాయిస్తారు? అన్న ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ఆ రకంగా అగ్రిమెంట్ జరిగిన తర్వాతే ప్రాజెక్ట్ లాక్ అయిందన్నది తొలి నుంచి వినిపిస్తోంది. ఇదే జరిగితే ప్రభాస్ పూర్తి చేయాల్సిన `సలార్-2`, `కల్కి 2` లాంటి ప్రాజెక్ట్ లు మరింత డిలే అవుతాయి? అన్నది వాస్తవం. అందుకు ఎలా లేదన్నా? ఏడాదిన్నర నుంచి రెండేళ్లు సమయం పడుతుంది. మరి ఈ ప్రణాళిక ప్రకారమే ప్రభాస్ ముందుకెళ్తాడా? కొత్త వ్యూహం రచిస్తున్నారా? అంటే తాజాగా మరో ఆసక్తికర విషయం తెరపైకి వస్తోంది.
కీలక పాత్రలన్నీ ఒకేసారి:
`స్పిరిట్` చిత్రీకరణకు సంబంధించి సందీప్ కొత్త విధానాన్ని అనుసరించేలా రెడీ అవుతున్నారుట. తొలుత ప్రభాస్ కి సంబంధించిన అన్ని రకాల సన్నివేశాలను పూర్తి చేసి అతడిని బయటకు పంపించాలనే కొత్త ప్లాన్ సిద్దం చేస్తున్నాడట. సినిమా అంతా హీరో చుట్టూనే తిరుగుతంది కాబట్టి ప్రభాస్ లేని సన్నివేశాలు అంటూ ఏవీ ఉండవు. చాలా పాత్రలతో ప్రభాస్ కాంబినేషన్ సన్నివేశాలుంటాయి. అవిగాక ప్రత్యేకంగా అతడిపై షూట్ చేయాల్సిన సోలో సన్నివేశాలు కొన్ని ఉంటాయి. వాటన్నింటిన ఓ ఆర్డర్ ప్రకారం ముందుగానే పూర్తి చేయాలని సందీప్ ప్లాన్ చేస్తున్నాడు.
ఆరేడు నెలలు స్పిరిట్ కోసమే:
షూటింగ్ మొదలైన నాటి ప్రభాస్ పార్ట్ మొత్తం పూర్తయ్యే వరకూ ఇతర ఆర్టిస్టుల జోలికి వెళ్లకూడదని భావిస్తు న్నాడుట. ప్రభాస్ తో కాంబినేషన్ సన్నివేశాలున్న నటులందర్నీ ఆ విధంగా డేట్లు సర్దుబాటు చేసుకోవాల్సిందిగా ఇప్పటికే సూచించినట్లు అత్యంత సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. అందుకు గానూ ప్రభాస్ ఆరు నెలలు పాటు పూర్తిగా 'స్పిరిట్' కోసమే డేట్లు కేటాయించాల్సి వస్తోందిట. ప్రభాస్ తదుపరి సినిమాలను దృష్టిలో పెట్టుకుని సందీప్ ఇలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ ప్రణాళిక ఎంత వరకూ సాధ్యమవుతుందో చూడాలి.
స్పిరిట్ కోసం రెస్ట్ లెస్ గా:
ఇలా ఇంత వరకూ ఏ డైరెక్టర్ ట్రై చేయలేదు. షూటింగ్ మొదలైందంటే? రకరకాల ఆర్టిస్టులను కలుపుకుని కాంబి నేషన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఈ క్రమంలో మధ్యలో హీరోకి కొంత విరామం దొరుకుతుంది. ఈ సమయంలో వెకేషన్లు...ఫ్యామిలీకి సమయం కేటాయించడాలు వంటివి చేస్తారు. కానీ స్పిరిట్ విషయంలో ఆరేడు నెలలు పాటు ప్రభాస్ అలాంటి వాటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ప్రభాస్ కి మాత్రం ఒకేసారి రెండు..మూడు షూటింగ్ లకు హాజరైన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే రెండు షిప్టులు పని చేయడం కూడా అలవాటు అయింది. కాబట్టి `స్పిరిట్` కోసం ఏకధాటిగా పనిచేయడం ప్రభాస్ కు పెద్ద సమస్య కాదు. `పౌజీ` చిత్రీకరణ మార్చి కల్లా ముగుస్తోం దని సమాచారం. అటుపై ఏప్రిల్ నుంచి డార్లింగ్ `స్పిరిట్` కు డేట్లు కేటాయించే అవకాశం ఉంటుంది.